Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మరిచిపోలేని రోజు ఇది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఢిల్లీలో ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. పుష్ప సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అవార్డును అల్లు అర్జున్ పొందిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయింది. ఇదే ప్రోగ్రామ్ కు రాజమౌళి కూడా వచ్చాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా అవార్డులు రావడంతో రాజమౌళి ఈవెంట్ లో సందడి చేశారు. బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ అని పేరు పిలవగానే అక్కడ అందరూ చప్పట్లతో రచ్చ రచ్చ చేశారు. అందరూ చప్పట్లు కొట్టడం చూసి, అల్లు అర్జున్ క్రేజ్ చూసి రాజమౌళి షాక్ అయ్యారు. రాజమౌళి బన్నీ ముఖాన్నే చూస్తూ ఉండిపోయారు.
అల్లు అర్జున్ తో సినిమా తీసి ఉండాలని రాజమౌళి భావించారా? అల్లు అర్జున్ కు అంత క్రేజ్ ఉందని రాజమౌళి ముందే ఊహించలేకపోయారా అనేది తెలియదు కానీ.. అల్లు అర్జున్ కు మామూలు క్రేజ్ లేదు. అల్లు అర్జున్ స్టేజీ మీదికి రాగానే.. మిగితా నటీనటులు అందరూ తమ సెల్ ఫోన్ లో అల్లు అర్జున్ బంధించారు. ఫోటోలు క్లిక్ మనిపించారు. చివరకు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఫోటోలు తీయకుండా ఆగలేకపోయారు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా అల్లు అర్జున్ అవార్డు అందుకుంటూ ఉండగా ఫోటో తీశాడు.
బన్నీ తర్వాత బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డును దేవిశ్రీ ప్రసాద్ అందుకున్నాడు. అలాగే.. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ఉప్పెన సినిమాకు బుచ్చిబాబు అవార్డు అందుకున్నాడు. అలాగే.. ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డులను కూడా మూవీ యూనిట్ అందుకుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.