Allu Arjun : తన కామెడీతో ఎలాంటి వారికైన కితకితలు పెట్టించే వారిలో అల్లు రామలింగయ్య ఒకరు. ఆయన కామెడీకి పరవశించని వారు లేరు. అల్లు రామలింగయ్య వారసులుగా అల్లు అరవింద్, అల్లు అర్జున్ సినీ పరిశ్రమలో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన శత జయంతి సందర్భంగా ఆయన తనయులు అల్లు అరవింద్ నేతృత్వంలో ఏర్పాటైన అల్లు స్టూడియో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ( chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవితో పాటు అల్లు కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లో కొత్త ఫిల్మ్ స్టూడియో – “అల్లు స్టూడియోస్” ( allu studios )ను ప్రారంభించారు. ఈ శతజయంతి వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్,అల్లు శిరీష్ మరియు మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈరోజు నేను ప్రత్యేకంగా కొంతమందికి కృతజ్ఞతలు తెలపాలని అనుకుంటున్నాను. 1950 నుంచి ఆ లిస్టు మొదలవుతుంది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోకపోతే చాలా తప్పు అవుతుంది. అల్లు రామలింగయ్య గారికి ఫస్ట్ సినిమాతో బ్రేక్ ఇచ్చిన గరికపాటి రాజారావు గారు.. పుట్టినిల్లు సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆయన లేకపోతే ఇవాళ మా జర్నీ మేము ఇలా ఉండేవాళ్లం కాదు అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 50 ఏళ్ల కాలంలో అయన ఎంతమంది దర్శకులతో నిర్మాతలతో పనిచేశారు. కానీ కానీ కొంతమంది గురించి చెబుతున్నాను. ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి శోభన్ బాబు గారికి కృష్ణ గారికి కూడా ధన్యవాదాలు. కృష్ణ గారితోనే ఆయన 200 సినిమాలకు పైగా చేశారు. ఇక బ్రహ్మానందం ఆలీ అలాగే మరి కొంతమంది కూడా ఆయనతో వర్క్ చేశారు.
ఇక ఆయనకు అల్లుడిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన స్థాయిని ఎన్నో రేట్లు పెంచారు. ఆయన చాలా గొప్ప అదృష్టవంతులు అని అన్నారు అల్లు అర్జున్ .ఇక అల్లు అరవింద్ గారికి గీతా ఆర్ట్స్ బ్యానర్ ఉంది, వాళ్లకి పెద్ద ల్యాండ్ ఉండి ఉంటుంది. వాళ్ళకి స్టూడియో పెట్టడం పెద్ద విశేషం కాకపోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ స్టూడియో పెట్టిన పర్పస్ మాకేదో కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని కాదు.. ఈ స్టూడియోస్ పెట్టడానికి కారణం ఇది మా తాతయ్య గారి కోరిక అన్నారు అల్లు అర్జున్. ఆయన జ్ఞాపకంగా ఇది నిర్మించాం. ఇక్కడ మంచి మంచి సినిమాలు షూటింగ్ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సాధారణంగా తండ్రి చనిపోతే వాళ్లపై ప్రేమ ఉంటుంది కాని, ముందుగా చేసినంత భారీస్థాయిలో మళ్ళీ మళ్ళీ ఫంక్షన్ లు చెయ్యరు. కానీ మా నాన్నగారు సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ ఇంకా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారిని ఇంతలా ప్రేమిస్తున్నారు అని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. వాళ్ళ నాన్నని అంతగా ఇష్టపడే మా నాన్నగారికి నా అభినందనలు. అలానే ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా మెగా అభిమానులకు. నన్ను ప్రేమించే నా ఆర్మీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.. అంటూ అల్లు అర్జున్ చాలా చక్కగా మాట్లాడారు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.