Bigg Boss 6 Telugu :బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అంటే మామూలు విషయం కాదు. బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే అన్ని వదిలేసుకోవాలి. లగ్జరీలకు గుడ్ బై చెప్పాలి. అప్పుడే హౌస్ లో ఎక్కువ రోజులు ఉండగలరు. అంతే కాదు.. హౌస్ లో బిగ్ బాస్ ఎంత చెబితే అంత. ఆయన మాట వినాలి. ఏ గేమ్ చెబితే ఆ గేమ్ ఆడాలి. మధ్యలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఎప్పుడు ఎవరికి ఏ టాస్క్ ఇస్తారో తెలియదు. పక్కన ఉన్నవాళ్లను నమ్మాలో వద్దో కూడా తెలియదు.
ఏమాత్రం ఆట సరిగ్గా ఆడకున్నా ఇక అంతే. ప్రేక్షకులు ఓటింగ్ లో ఓడించేసి ఇంటికి పంపించేస్తారు. ఇక.. ఈ వారం హౌస్ మెట్స్ కు ఇచ్చిన టాస్క్ గురించి తెలుసు కదా. అందరికీ బిగ్ బాస్ డబ్బులు ఇచ్చి చివరి వరకు ఎవరి వద్ద ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్లకు టిప్స్ వస్తాయి అని చెబుతాడు. చివరకు ఆదిరెడ్డి, బాలాదిత్య, ఇనయా, చంటి.. ఈ నలుగురి దగ్గర చివరి వరకు ఒక్క రూపాయి కూడా మిగలదు. దీంతో ఈ నలుగురిలో ఒక్కరు ఈ సీజన్ మొత్తం కెప్టెన్ అయ్యే అర్హతను కోల్పోతారని నాగార్జున చెబుతాడు.
బాలాదిత్యకు ఒక్క ఓటు కూడా పడదు. ఆదిరెడ్డికి ఒక్క రేవంత్ మాత్రం ఓటేశాడు. ఇనయా, చంటికి తలో మూడు ఓట్లు పడ్డాయి. దీంతో వీళ్లకు టై అవుతుంది. దీంతో నిర్ణయాన్ని కెప్టెన్ కీర్తికి వదిలేస్తాడు డాక్టర్. దీంతో చంటికే ఓటేస్తుంది కీర్తి. దీంతో ఈ సీజన్ లో కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయి.. కెప్టెన్ కాకుండా బ్యాన్ అయ్యాడు చంటి. అయితే.. తాను బెడ్ రూమ్ లో పనిచేస్తున్న సమయంలో.. కేవలం కెమెరాలో కనిపించడానికే నేను పనిచేస్తున్నానని కొందరితో చంటి అన్నాడని.. అది నాకు చాలా బాధించిందని చెప్పిన కీర్తి.. అందుకే చంటికి ఓటేశానని చెప్పింది. ఈ ఘటన తెలుసుకొని చంటి చాలా బాధపడ్డాడు. నువ్వేంటో.. నీ విశ్వరూపం ఏంటో చూపించే సమయం వచ్చింది చంటీ. ఇక నువ్వు రెచ్చిపోవాలి అంటూ నాగార్జున చంటీకి బూస్ట్ ఇస్తాడు. దీంతో ఖచ్చితంగా సార్ అని చెబుతాడు చంటి.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.