Home » Entertainment » Allu Arjun Sneha Reddy Comments On Allu Arjun T Shirt
Entertainment

Allu Arjun : అల్లు అర్జున్‌ను అలా ఇరికించేసిన స్నేహారెడ్డి.. ఇంతకీ బన్నీ టీ షర్ట్ పైన ఏం రాసి ఉందంటే?

Authored By
mallesh
The Telugu News | Published on: December 18, 2021, 7:00 pm
Advertisement

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పార్ట్ వన్ ‘పుష్ప: ద రైజ్’ చూసి మెగా అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ నెవర్ బిఫోర్ మాస్ అవతార్‌లో ఇరగదీశాడని సంతోషపడిపోతున్నారు. ఈ సంగతి అలా ఉంచితే బన్నీని ఆయన వైఫ్ స్నేహారెడ్డి ఈ పోస్టు ద్వారా కాంట్రవర్సీలోకి ఇరికించేసింది.ఇంతకీ ఆమె పెట్టిన పోస్టు ఏంటి..‘

Advertisement

పుష్ప’ సినిమాలో బన్నీ యాక్టింగ్ వేరే లెవల్‌లో ఉందని, ‘పుష్ప’రాజ్ గా బన్నీ చించేశాడని మెగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. థియేటర్స్ ముందర టపాసులు కాల్చి ఆనందపడిపోతున్నార. ఇకపోతే తన భర్తతో కలిసి సినిమా చూడటం తనకు చాలా ఆనందనిచ్చిందని స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. సదరు పోస్టులో ఈ రోజు నాకు ఎంతో ముఖ్యమైనదని పేర్కొంది. ఈ క్రమంలోనే బన్నీ ధరించిన టీషర్ట్ గురించి స్నేహారెడ్డి ప్రస్తావించింది.బన్నీ ధరించిన సదరు టీ షర్ట్‌పై ఏఏ అనే అక్షరాలతో పాటు లవ్ సింబల్ ఆర్‌డీ‌వై అనే అక్షరాలు ఉన్నాయి.

allu arjun sneha reddy comments on allu arjun t shirt

Advertisement

Allu Arjun : ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని కుటుంబ సభ్యులతో సినిమా చూసిన బన్నీ..

దాంతో టీషర్ట్ చూసి అది రౌడీ బ్రాండ్ టీషర్ట్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు కొందరు. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు అల్లు అర్జున్‌కు మధ్య ఉన్న బాండ్ తెలిపేలా టీ షర్ట్ ఉందని అంటున్నారు. అయితే, దాని మీనింగ్ అదేనా.. లేదా రెడ్డి లవ్స్ అల్లు అర్జన్ నా? లేదా రౌడీ లవ్స్ అల్లు అర్జున్‌నా? అని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అల్లు స్నేహారెడ్డి బన్నీని ఇరికించేసిందని మాత్రం పోస్టులు పెడుతున్నారు. ఈ విషయాలపై బన్నీ ఏం సమాధానం చెప్తారో చూడాలి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి