Allu Arjun trolled by netigens
Allu Arjun : అల్లు అరవింద్ సారథ్యంలో మొదలైన ఆహా ఓటీటీ ఇప్పుడు అనూహ్యంగా టాప్ ఓటీటీ ల జాబితాలో చేరింది. అల్లు అరవింద్ ఒక క్రియేటివ్ టీమ్ ను ఏర్పాటు చేసి కంటెంట్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ అత్యధికంగా ఖర్చు చేస్తూ వస్తున్నారు. అందుకే ఆహా ఓటీటీకి రెండేళ్లలోనే అనూహ్యంగా స్పందన దక్కింది. సమంత తో టాక్ షో ను చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఆహా వారు ఆ తర్వాత బాలయ్య తో అన్ స్టాపబుల్ షో ను చేసి టాక్ షో లకు బాప్ అని నిరూపించారు. బాలయ్య అన్ స్టాపబుల్ షో లో టాలీవుడ్ ప్రముఖు లు పాల్గొని నెం.1 షో గా నిలిపారు. వారితో బాలయ్య సాగించిన ఆట పాట అందరి దృష్టిని ఆకర్షించి జాతీయ స్థాయిలో నెం.1 టాక్ షో గా నిలిచేలా చేసింది.
ఆహా టాక్ షో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ సమయంలో అన్ స్టాపబుల్ మొదటి సీజన్ ముగియబోతున్నట్లుగా ఆహా టీమ్ ప్రకటించారు. దాంతో వెంటనే బాలయ్య టాక్ షో స్థానంలో వెంకటేష్ తో ఒక గేమ్ షో ను ఆరంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ గేమ్ షో గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాకుండానే ఆహా టీమ్ అప్పుడే మరో టాక్ షో ను ప్లాన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆహా వారు అల్లు అర్జున్ తో కూడా ఒక టాక్ షో ను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఆహా కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఆహా కోసం సరికొత్తగా బన్నీ కనిపిస్తూ ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆహా లో బన్నీ టాక్ షో ను షురూ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
allu arjun talk show in aha like balakrishna unstoppable
ఓటీటీ ల్లో టాక్ షో లు కొత్తేం కాదు. కాని ఈ టాక్ షో చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య షో ను మించేలా బన్నీ షో ను డిజైన్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ తో ఒక ప్రముఖ దర్శకుడు ఈ టాక్ షో ను ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అల్లు అరవింద్ బ్యాక్ టు బ్యాక్ షో లతో ఆహా ఓటీటీ ని టాప్ ఓటీటీల మద్య నిలిపేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అల్లు అర్జున్ టాక్ షో అంటే ఆహా స్థాయి మరింతగా పెరగడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆహా ముందు ముందు మరిన్ని షో లు మరియు వెబ్ సిరీస్ లను తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆహా తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోకి కూడా విస్తరించబోతున్నట్లుగా ఇటీవలే అల్లు టీమ్ ప్రకటించిన విషయం తెల్సిందే.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.