
Allu Arjun trolled by netigens
Allu Arjun : అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ పొందిన నటుడు అల్లు అర్జున్. చిరంజీవిని ఇన్సిపిరేషన్ తీసుకొని సినిమా పరిశ్రమలోకి వచ్చిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా బన్నీ క్రేజ్‌ని అమాంతం పెంచేసింది. దేశ విదేశాలలో అతని ఫ్యాన్ ఫాలోయింగ్ పుష్ప సినిమాతో రెట్టింపు అయింది. ప్రస్తుతం బన్నీ చేస్తున్న పుష్ప 2 కూడా హిట్ అయితే ఆయన రేంజ్ మరింత పెరగడం ఖాయం అని అంటున్నారు. అయితే బన్నీ క్రేజ్ గురించి పక్కన పెడితే కొన్ని సందర్భాలలో అతని ప్రవర్తన చర్చనీయాంశంగా మారుతుంది. బన్నీ వ్యవహార శైలి వలన కొందరు అతనని తగ ట్రోల్స్ చేస్తుంటారు.
రీసెంట్‌గా కృష్ణం రాజు మృతి చెందగా, ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఎలాంటి ట్వీట్ చేయకపోవడంతో కొందరు అతనిని తెగ ట్రోల్స్ చేశారు. కృష్ణ – చిరంజీవి – మోహన్ బాబు – మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – ఎన్టీఆర్ వంటి స్టార్స్ ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించడమే కాదు.. జూబ్లీ హిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం కృష్ణంరాజు మరణంపై ట్వీట్ చేయకుండా.. తనకు సైమా అవార్డ్ దక్కడం పై పోస్ట్ పెట్టడంపై ట్రోల్స్ వచ్చాయి. రియల్ లైఫ్ లో ప్రభాస్ మరియు బన్నీ మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. అలాంటిది ఆయన పెదనాన్న మృతిపై సంతాపం ప్రకటించకుండా.. తన అవార్డ్ గురించి పేర్కొందమేంటని ఓ వర్గం నెటిజన్లు అల్లు అర్జున్ పై మండిపడ్డారు.
Allu Arjun trolled by netigens
బన్నీ విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన అవేమి పట్టించుకోలేదు. సైమా వేడుక పూర్తైన వెంటనే హైదరాబాద్ వచ్చిన బన్నీ డైరెక్ట్‌గా హైదరాబాద్ కు వచ్చి నేరుగా ప్రముఖ నటుడి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు . కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. కఠిన సమయంలోనూ తన స్నేహితుడు ప్రభాస్ మొహంలో నవ్వు కనిపించేలా చేసాడు. దీంతో విమర్శించిన నెటిజన్ల నోళ్లన్నీ మూతపడ్డాయి. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన ఎలాంటి ట్వీట్ పెట్టకపోవడంతో విమర్శకులు రెచ్చిపోయారు.వాటిపై బన్నీ ఏమాత్రం స్పందించలేదు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.