
annie dance video viral on instagram
Annie : ఇటీవల ఓ సాంగ్ పాపులర్ అయిందంటే చాలు దానికి ఎగబడి డ్యాన్స్ లు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పల్సర్ బైక్ సాంగ్ ఫుల్ పాపులర్ అయింది. ‘‘చింపిరి జుట్టు దాన్ని.. చెవులు ఇరుసున చుట్టదాన్ని.. చేతిలా అగ్గిపెట్టి దాన్ని.. ఉంగరాల మెట్ట దాన్ని.. నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.. పల్సర్ బైక్ పైన రారా బావో.. నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.. పల్సర్ బైక్ పైన రారా బావో..’’ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది ఈ ఫోక్ సాంగ్. ఇన్ స్టాగ్రామ్ రీల్స్.. ఫేస్ బుక్.. ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో ఎక్కడ చూసినా కూడా ఈ పాట హంగామానే నడుస్తుంది. సామాన్యులు, సెలబ్రిటీలు ఈ సాంగ్‌కి తెగ స్టెప్పులేస్తూ రచ్చ చేస్తున్నారు.
అమ్మాయిలైతే ఈ పల్సర్ బైక్ పాట పెట్టుకుని నా నామిరంగా అంటూ నాట్యం ఆడేస్తున్నారు. నిజానికి ఈ పాట వింటే ఊపు రావాల్సిందే అనేట్టుగా ఉంది. ఇటీవల ఓ బస్సు కండక్టర్ ..‘నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.. పల్సర్ బైక్ పైన రారా బావో’.. అంటూ స్టేజ్‌ని షేక్ చేసింది. ఎంతలా అంటే.. ఆమని లాంటి కూల్ ఉమెన్.. ‘నా వల్ల కావడం లేదు.. నేను కూడా వచ్చి అక్కడ చేయాలనిపిస్తుంది’ అంటూ ఆ డాన్సర్‌తో కలిసి చిందులు వేసింది. ఇక ఇప్పుడు నాగార్జున నటించిన రాజన్న చిత్రంలోని చిన్నారి కూడా ఈ పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
annie dance video viral on instagram
అన్నీ ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా తెగ సందడి చేస్తూ నానా రచ్చ చేస్తుంది. ఈ క్రమంలో పాపులర్ అయిన ఈ సాంగ్‌కి చిందులేసి రచ్చ చేసింది. ఈ అమ్మడు ‘అనుకోకుండా ఒక రోజు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అన్నీ.. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది. నాగార్జున నటించిన రాజన్న సినిమాలో మల్లమ్మ పాత్రతో మంచి పేరు సంపాదించుకుంది. రంగస్థలం సినిమాలో చరణ్ చెల్లిగా కూడా నటించింది. ఇక గత ఏడాది ఓ వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలను బాగా పంచుకుంటుంది. చిన్న వయసులో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ అవ్వాలని ఈ అమ్మడు భావిస్తుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.