Allu Arjun : పుష్పలో క్రూరంగా క‌నిపించేందుకు అల్లు అర్జున్ అన్ని క‌ష్టాలు ప‌డ్డాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : పుష్పలో క్రూరంగా క‌నిపించేందుకు అల్లు అర్జున్ అన్ని క‌ష్టాలు ప‌డ్డాడా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :10 February 2022,10:00 am

Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప‌. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సంచలన విజయం నమోదు చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో కనిపించారు బన్నీ. అలాంటి సంక్లిష్టమైన పాత్రలో జీవించారని సినీ అభిమానులతో పాటుగా సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్ర కోసం అల్లు అర్జున్ మేకోవర్ అయిన తీరును చూసి అందరు ఆశ్యర్య చకితులయ్యారు. తాజాగా పుష్ప టీం ఆయ‌న మేకొవ‌ర్‌కి సంబంధించి ఓ వీడియో విడుద‌ల చేసింది.

అల్లు అర్జున్ ఇందులో కూలీగా లారీ డ్రైవర్ గా స్మగ్లర్ గా మూడు కోణాల్లో కనిపించారు. అయితే పుష్పరాజ్ గా తనను తాను మలచుకోడానికి బన్నీ తీవ్రంగా శ్రమించాడు. పుష్పరాజ్ పాత్రకి తగ్గట్టుగా మేకప్ వేసుకోవడానికి అంకితభావంతో తీవ్రంగా శ్రమించాడని ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. మేకప్ కోసమే డైలీ కొన్ని గంటల సమయం కేటాయించారు. మేకప్ వేయడానికి రెండు గంటలు పడితే.. దాన్ని తొలగించడానికి అర గంటపైనే పట్టేదని ‘పుష్ప’ మేకర్స్ ఆ మధ్య తెలిపారు.ఈ వీడియో చూసిన ప్ర‌తి ఒక్క‌రు బ‌న్నీ నిబ‌ద్ధ‌త‌పై కామెంట్స్ చేయ‌డం పక్కా.

Allu Arjun turns into a cruel villain for pushpa Movie

Allu Arjun turns into a cruel villain for pushpa Movie

Allu Arjun  : ఇది క‌దా పుష్ప‌రాజ్ అంటే..

పుష్ప సినిమా కోసం చిత్తూరు యాసలో డైలాగ్స్ చెప్పడానికి స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు బ‌న్నీ. అడవుల్లో స్మగ్లింగ్ చేసే క్లిష్టమైన పుష్పరాజ్ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకొని.. రెండేళ్ల పాటు షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్’ సినిమా కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. మొదటి భాగానికి మించి ఉండేలా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే అమెజాన్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్‌లో ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టడం మాములు విషయం కాదు. ఏపీలో మాత్రం ఫ్లాప్‌గా నిలిచిన ‘పుష్ప’ మిగతా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది