Karthika Deepam 9 June Today Episode : జ్వాల చేయి మీద ఉన్న హెచ్ అక్షరాన్ని చూసి శోభ షాక్.. హిమకు క్యాన్సర్ అని తెలిసినా పెళ్లి చేసుకునేందుకు నిరుపమ్ రెడీ

Karthika Deepam 9 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 జూన్ 2022, గురువారం ఎపిసోడ్ 1374 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమ మనసులో ఏముందో తెలుసుకుందామని జ్వాలకు చెబుదామని పిలిపిస్తే.. ఇప్పుడు హిమ కూడా వచ్చిందేంటి అని అనుకుంటాడు నిరుపమ్. చివరకు జ్వాలకు తాను అమెరికా వెళ్లిపోతున్నాని చెబుతాడు. దీంతో హిమ షాక్ అవుతుంది. నిరుపమ్ బావ అమెరికా వెళ్లిపోతే శౌర్యతో పెళ్లి ఎలా చేయాలి అని భయపడుతుంది. టెన్షన్ పడుతుంది. తన అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతానేమో అని భయపడి మూర్చపోతుంది. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్తుంది హిమ. తను ఇంటికి రాగానే.. సౌందర్య తనను పిలుస్తుంది. రాఅమ్మా.. మా ఇంటి మహాలక్ష్మి అని అంటుంది. తనను హేళన చేస్తుంది. దీంతో వద్దు.. తనను ఎందుకు హేళన చేస్తున్నావు అంటాడు ఆనంద రావు.

karthika deepam 9 june 2022 full episode

ఆ శోభాదేవి.. చివరకు నా కూతురు, అల్లుడిని కలిపిందట.. అని అంటుంది సౌందర్య. ఇక.. చివరకు ఆ స్వప్న.. ఆ శోభాదేవినే కోడలుగా చేసుకుంటుంది. అందరూ తనను నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు. నువ్వేం చేస్తావమ్మా మరి.. నువ్వేం చేయవు. స్వప్నతో చాలెంజ్ చేస్తే నన్ను ఓడించావు అంటుంది సౌందర్య. ఎవరైనా ఒక్క మాట మీద ఉంటారు. పైగా ఆ శోభను అల్లుడు తెగ పొగుడుతున్నాడు అంటుంది సౌందర్య. ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పమ్మా అని హిమను అడుగుతాడు ఆనంద రావు. అలా మౌనంగా ఉండిపోకమ్మా. నీ మౌనం ఖరీదు.. నిండు నూరేళ్ల నీ జీవితం అంటాడు. చివరకు హిమ ఒక పేపర్ ఇచ్చి మీ అన్ని ప్రశ్నలకు ఇందులో సమాధానం ఉంది అని అంటుంది సౌందర్య.

అందులో చూసి.. సౌందర్య షాక్ అవుతుంది. అవి రిపోర్ట్స్. ఆనంద రావు కూడా వాటిని చూసి షాక్ అవుతాడు. ఇద్దరూ కింద కూలబడి ఏడుస్తుంటారు. తర్వాత ఆ రిపోర్ట్స్ ను హిమ నిరుపమ్ కు కూడా చూపిస్తుంది. షాక్ అవుతాడు. ఏంటిది.. నీకు క్యాన్సరా అంటాడు నిరుపమ్.

దీంతో అవును అంటుంది హిమ. థర్డ్ స్టేజ్ అని తెలిసింది బావ అంటుంది హిమ. ఇక.. నేను అంటూ చెప్పబోతుండగా.. హిమ నీకేం కాదు అంటాడు నిరుపమ్. నేనున్నాను.. నేను బతికించుకుంటాను అంటాడు నిరుపమ్. నీకేం కానివ్వను అంటాడు నిరుపమ్.

ఈ మధ్య ఎన్నో మెడికల్ అద్భుతాలు జరుగుతున్నాయి కదా అంటాడు నిరుపమ్. ఈ స్టేజ్ కు వచ్చేదాకా తెలుసుకోకపోవడం ఏంటి అంటాడు నిరుపమ్. నీకేం కాకుండా నా ప్రాణాలు అడ్డేస్తాను అంటాడు నిరుపమ్. ఇవన్నీ జరగవు బావ అంటుంది హిమ.

Karthika Deepam 9 June Today Episode : నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకో అని నిరుపమ్ కు చెప్పిన హిమ

నువ్వు నా కోసం ఒక పని చేయి బావ. ఈ విషయం జ్వాలకు చెప్పకు అంటుంది హిమ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు.. నేనింత బాధలో ఉంటే.. ఆ జ్వాల టాపిక్ ఏంటి. అసలు తనకు ఎందుకు చెప్పొద్దు అంటాడు నిరుపమ్. బయటికి అలా కనిపిస్తుంది కానీ.. తను చాలా సెన్సిటివ్ అంటుంది హిమ. నేనంటే తనకు చాలా ఇష్టం అంటుంది.

నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంటి జ్వాలకు చెప్పొద్దంటావు. అదేమన్నా అంత ఇంపార్టెంట్ విషయమా చెప్పు అంటాడు నిరుపమ్. ఈ టైమ్ లో కూడా నా మాటకు ఎదురు చెప్పాలని ప్రయత్నించకు అంటుంది హిమ. నన్ను మరిచిపో బావ అంటుంది హిమ.

ఇంకొన్ని రోజుల్లో చనిపోయేదాన్ని.. నాకు ప్రేమ, పెళ్లి ఎందుకు. నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకో. నా ఆత్మ శాంతిస్తుంది అంటుంది హిమ. దీంతో షటప్ హిమ. ఇలా మాట్లాడకు హిమ అంటాడు నిరుపమ్. నువ్వు బతుకుతావు. నాకోసం బతుకుతావు. బతకాలి కూడా అంటాడు నిరుపమ్.

నువ్వు ఏం అనుకున్నా మనకు రాసిపెట్టిలేదు. నన్ను తొందరగా తీసుకెళ్లిపోతున్నాడు ఆ దేవుడు అంటాడు నిరుపమ్. ప్లీజ్ హిమ.. అలా మాట్లాడుకు అంటాడు నిరుపమ్. మరోవైపు హిమకు క్యాన్సర్ ఉందన్న విషయం తెలియదు ప్రేమ్ కు. ఇంకా తన ఫోటోలను ఫోన్ లో చూస్తూ ఉంటాడు ప్రేమ్.

ప్రేమ్.. హిమ గురించి తెలిసిందా అని అడుగుతాడు. దీంతో తెలిసింది డాడ్ అంటాడు ప్రేమ్. పాపం.. హిమకు అలా జరగాల్సింది కాదు అంటాడు సత్యం. సెల్ ఫోన్ బాగోలేదు కదా.. నా లవ్ వీడియో చూడలేదు అనుకున్నాను. కానీ.. హిమ చూసిందేమో.. తనకు క్యాన్సర్ అని తెలిసే రియాక్ట్ కాలేదేమో అని అనుకుంటాడు ప్రేమ్.

సారీ హిమ.. నీకు ఫోన్ చేయాలో వద్దో కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటాడు ప్రేమ్. మరోవైపు జ్వాల నిరుపమ్ ఫోటోలనే చూస్తూ ఉంటుంది ఫోన్ లో. ఏయ్ డాక్టర్ సాబ్. ఏంటి ఆ లుక్కు. ఏంటి సంగతి అని మనసులో అనుకుంటుంది.

ఇంతలో అక్కడికి ఒక జ్యోతిష్కుడు వస్తాడు. ఏంటి స్వామి.. చేయి చూసి జాతకం చెబుతావా అని అంటుంది. దీంతో నీది మహాజాతకం అంటాడు. చేయి చూసి చెబుతాను నేను అంటాడు జ్యోతిష్కుడు. నేను చేసే పనే అది అంటాడు కానీ.. తను వినదు.

నాకు వేరే ప్రాంతానికి వెళ్లే పని ఉంది.. జూబ్లీహిల్స్ లో దింపు అంటాడు. ఆ తర్వాత తనకు శోభ కనిపిస్తుంది. తన పేరు మీద ఉన్న హెచ్ అనే అక్షరాన్ని చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత.. హిమకు అన్నీ నేనే దగ్గరగా ఉండి చూసుకుంటా అని చెబుతాడు నిరుపమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

33 minutes ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

2 hours ago

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

3 hours ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

4 hours ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

5 hours ago

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

6 hours ago

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…

7 hours ago

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

8 hours ago