Home » Entertainment » Allu Arjun Zomato Commercial Video Controversy
Entertainment

Allu Arjun : తెలుగు హీరో అయ్యిండి సౌత్‌ సినిమా అంటే చులకన ఏందుకు అల్లు అర్జున్ భయ్యా?

Authored By
Himanshi
The Telugu News | Published on: February 6, 2022, 10:30 am
Advertisement

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప సినిమా తో మొదటి సారి పాన్ ఇండియా స్టార్ డమ్ ను దక్కించుకున్నాడు. కేవలం పుష్ప హిందీ వర్షన్ వంద కోట్లకు పైగా వసూలు చేయడం తో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ సూపర్ స్టార్ గా నిలిచి పోయాడు. పుష్ప సినిమా ఏకంగా మూడు వందల యాభై కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన నేపథ్యం లో టాలీవుడ్ లోనూ అతని క్రేజ్‌, ఇమేజ్‌ పెరిగింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న వారికే బ్రాండ్ అంబాసిడర్లుగా అవకాశాలు వస్తూ ఉంటాయి. అందుకే అల్లు అర్జున్ తో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీ మొత్తంలో పారితోషికం తీసుకొని ఆ సంస్థ ను తాజాగా ప్రమోషన్ చేసేందుకు బన్నీ సైన్‌ చేశాడు.అందులో భాగంగా ఒక కమర్షియల్ యాడ్ షూటింగ్లో కూడా పాల్గొన్నాడు. ఆ యాడ్‌ లో అల్లు అర్జున్ మంచి స్టైల్ గా కనిపించాడు అంటూ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇప్పుడు అదే యాడ్‌ బన్నీని వివాదంలో నెట్టింది. సౌత్ సినిమా ను అవమానపరుస్తూ అల్లు అర్జున్ ఆ యాడ్ లో వ్యాఖ్యలు చేశాడంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అల్లు అర్జున్ రాపిడో యాడ్ లో నటించి ఆర్టీసీ నీ తక్కువ చేసి మాట్లాడాడు అంటూ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. దాంతో ఆ యాడ్ ను మార్చి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే తరహాలో జొమాటో యాడ్‌ విషయంలో కూడా వివాదం కొనసాగుతోంది. సౌత్ సినిమా లో ఫైట్స్ కాస్త అతిగా ఉంటాయి అంటూ అల్లు అర్జున్ తన యాడ్ లో చెప్పడం జరిగింది.ఒక తెలుగు హీరో అయ్యుండి సౌత్ సినిమా పరుగు తీయడం ఏంటి బాసు అంటూ అల్లు అర్జున్ ని కొందరు సినిమా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మన సినిమా గురించి మనమే తక్కువ తీసుకోవడం ఏ మాత్రం కరెక్టు కాదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎలాగో పాన్ ఇండియా స్టార్ అయ్యావని సౌత్ సినిమాలు తక్కువ చేస్తున్నావా అంటూ మరి కొందరు బన్నీ పై ఫైర్ అవుతున్నారు.

Allu Arjun zomato commercial video controversy

Advertisement

Allu Arjun : పుష్ప పార్ట్‌ 2 కోసం బన్నీ, సుకుమార్‌ హడావుడి

మొత్తానికి అల్లు అర్జున్ సౌత్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మెల్ల మెల్లగా రాజేస్తున్నాయి. ఈ వివాదం ఎక్కడకు దారితీస్తుందో అనేది అల్లు అర్జున్ అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. ఈ వివాదం విషయం పక్కన పెడితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 కోసం రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలోనే రూపొందబోతున్న ఈ పార్ట్‌ 2 కూడా పార్ట్ వన్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం వ్యక్తం అవుతోంది. హిందీ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప పార్ట్ వన్ స్థాయిలోనే పుష్ప 2 కూడా భారీగా వసూలు దక్కించుకునేలా తెరకెక్కిస్తాం అంటూ సుకుమార్ నమ్మకంతో ప్రేక్షకులకు హామీ ఇస్తున్నాడు. పుష్ప రెండో పార్ట్ ను కూడా ఈ సంవత్సరం డిసెంబర్ లోనే విడుదల చేసేలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం పుష్ప మేనియా నడుస్తోంది. కనుక ఈ సమయంలోనే పుష్ప 2 విడుదల చేస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయం తో ఉన్నారు. అందుకే చాలా వేగంగా సినిమా ను పూర్తి చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి