shanmukh shares to deepthi Sunaina a screen shot that goes viral
Deepthi Sunaina Shanmukh : యూట్యూబ్ స్టార్ట్ షన్నూ మరియు దీప్తి సునయనల లవ్ బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. వీరి బ్రేకప్ కి బిగ్ బాస్ సీజన్ 5 లో జరిగిన సంఘటనలే కారణం అంటూ చాలా మంది భావిస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియదు కానీ వీరిద్దరి మధ్య ప్రస్తుతానికి మాటలు లేవు. దీప్తి సునైనా సోషల్ మీడియా ద్వారా చాలా ఎమోషనల్ గా స్వయంగా బ్రేకప్ చేసింది. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తానని అంటూ షన్నూ కూడా బ్రేకప్ అంగీకరిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టడం జరిగింది. వీరిద్దరూ ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా మళ్లీ కలుస్తారు అనే ప్రచారం మొదలైంది. గత వారం రోజులుగా ఈ విషయమై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ సమయంలో షన్నూ షేర్ చేసిన ఒక పోస్టు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. షన్నూ సోషల్ మీడియా ద్వారా తనకు మొబైల్ లో వచ్చిన ఒక నోటిఫికేషన్ మెసేజ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ని షేర్ చేశాడు అందులో హాయ్ షన్నూ నీకోసం వాలెంటైన్స్ డే అవుట్ ఫిట్ రెడీగా ఉంది. మీరు వాలెంటైన్స్ డే కోసం వేచి చూస్తున్నట్లు అయితే ఈ అవుట్ ఫిట్ మీకోసమే. మీ వాలెంటైన్స్ డే ప్లాన్ ఏంటీ అంటూ ఆ మెసేజ్ ఉంది. దాన్ని షేర్ చేసిన షన్నూ తనదైన స్టైల్ లో రేయ్ ఏంట్రా ఇది అన్నట్లుగా కోపంతో ఈమోజీ లను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశాడు. అంటే ఇప్పటికే బ్రేకప్ అయ్యి నేను ఉంటే ఏంట్రా బాబు అంటూ షన్నూ జుట్టు పీక్కుంటున్నట్లుగా ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
shanmukh shares to deepthi Sunaina a screen shot that goes viral
విడిపోయారు అనుకుంటున్నా సిరి మరియు శ్రీహాన్ లు కలిసిపోయారు. వారిద్దరిని మళ్లీ కలిపి చూస్తామని ఏ ఒక్కరు అనుకోలేదు. గత కొన్ని రోజులుగా ఇద్దరు కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా కలిసిందే లేదు. అలాంటి వారు ఇటీవలే రవి, నిత్య డిన్నర్ పార్టీలో సందడి చేయడం జరిగింది. రవి కూతురుతో సిరి మరియు శ్రీహాన్ లు తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. సిరి మరియు శ్రీహాన్ లు కలిసి పోయారు. దాంతో కచ్చితంగా షన్నూ మరియు దీప్తి సునైనా లు కూడా కలుస్తారు అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబోను అమితంగా ఇష్టపడే అభిమానులు వీరిద్దరి కలయిక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో రెండు మూడు సార్లు వీరిద్దరు విడిపోయారు. కాని మళ్లీ కలిశారు. ఈసారి కూడా అలాగే కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ అభిమానులు ఇంకా నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.