Allu Arvind reveals on Allu Arjun
Allu Arjun : స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్‌స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ఫుల్ క్రేజ్ అందుకున్నాడు బన్నీ. తాజాగా ఆయన గురించి తండ్రి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పక్కా కమర్షియల్’ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడిన ఆయన.. ‘బన్నీ రెండు వారాలు విదేశాలకు వెళ్లి నిన్ననే ఇంటికి వచ్చాడు. ఎఫ్3 మూవీ చూడాలని ఇంట్లో ఉన్న క్యూబ్ ఆన్ చేయబోతే.. నేను థియేటర్‌కు వెళ్లమని చెప్పా. నిన్న రాత్రే ఎఫ్3 సినిమాకు వెళ్లి ఉంటాడు. కూకట్‌పల్లిలో ఉన్న థియేటర్లకు వెళతాడు. సినిమా స్టార్ట్ అవ్వగానే ముసుగు వేసుకుని లోపలికి పోతాడు. ఇంటర్వెల్‌లో కొంచెం ముందు బయటకు వచ్చి..
ఆ తరువాత మళ్లీ లోపలికి వెళ్లి సినిమా మొత్తం చూసేస్తాడు..’ అని అల్లు అరవింద్ చెప్పాడు. పక్కా కమర్షియల్ మూవీని థియేటర్లలోనే చూడాలని కోరారు. ఓటీటీలో వచ్చేందుకు టైమ్ పడుతుందన్నారు. ‘ఇండస్ట్రీ ఇప్పుడు నేర్చుకున్న పాఠం ఏంటంటే.. కొంచెం టికెట్ ధరలు తగ్గించాలి. ఓటీటీను కొంచెం దూరం పెట్టాలి. కొన్ని వారాల తరువాతే ఓటీటీలోకి తీసుకురావాలి. ఈ మధ్య ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదు..’ అని ఆయన అన్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం హీరో కూడా రావాలని అల్లు అరవింద్ అన్నారు. ఈ మధ్య స్టేజ్ మీద ఓ పెద్ద హీరో డ్యాన్స్ కూడా చేశారని.. సినిమాను ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Allu Arvind reveals on Allu Arjun
ఇక ఇటీవల అల్లు అర్జున్ పై అక్షయ్ కుమార్ చేసిన కామెంట్ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. పృథ్వీరాజ్ ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా అక్షయ్ కి సౌత్ దండయాత్ర గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అలాంటి ప్రశ్నలకి గట్టి కౌంటర్ ఇచ్చిన అక్షయ్ అల్లు అర్జున్ ని మాత్రం స్పెషల్ గా మెన్షన్ చేసి బన్నీ ఫ్యాన్స్ అటెక్షన్ ను గ్రాబ్ చేసాడు. అన్ని ఇండస్ట్రీల్లోని నటీనటులు కలిసి పని చేయాల్సిన సమయం వచ్చిందన్న అక్షయ్.. అల్లు అర్జున్ త్వరలో నాతో పని చేస్తాడేమో, నేను మరొక సౌత్ స్టార్‌తో నటిస్తాను ఏమో. సౌత్, నార్త్ కలవాలంటే ఇకపై అదే మార్గం అన్నారు.
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
This website uses cookies.