Allu sirish faces problems with Allu Family
Allu Family : అల్లు రామలింగయ్య నట వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అల్లు అర్జున్, శిరీష్. తన తండ్రి టాప్ ప్రొడ్యూసర్ కావడంతో సులభంగా చాన్స్ లు అందుకున్నారు. అల్లు అర్జున్ విషయానికి వస్తే మొదట్లో కుటుంబ నేపథ్యంతో చిత్ర రంగ ప్రవేశం చేసినా, ఆ తర్వాత తన నటనా ప్రతిభ, డ్యాన్సింగ్ నైపుణ్యం, కథల ఎంపిక వంటి అంశాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ ఐకాన్ స్టార్ గా ఎదిగారు. ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోని వ్యక్తి అల్లు అర్జున్. ఇటీవల తన తాతయ్య అల్లు రామలింగయ్యను బన్నీ స్మరించుకున్నారు. “మా పునాది” అంటూ ఆ ఫొటోపై కామెంట్ చేశారు. ఈ ఫొటోకు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది…
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి హాస్యనటుడిగానూ, క్యారెక్టర్ నటుడిగానూ అల్లు రామలింగయ్య ఎంతో పేరుప్రతిష్ఠలు అందుకున్నారు. ఆయన 50వ దశకంలో సినీ రంగ ప్రవేశం చేసి కొన్ని వందల సినిమాల్లో పలు తరాల వారితో కలిసి నటించారు. అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్ చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా నిలదొక్కుకోవడం తెలిసిందే. ఇక, అల్లు రామలింగయ్య అల్లుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వరుసలోనే అల్లు అర్జున్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
Allu sirish faces problems with Allu Family
అల్లు అర్జున్ తో పోల్చితే శిరీష్ పరిస్థితి పూర్తిగా విరుద్ధం. 2013లో విడుదలైన గౌరవం మూవీతో శిరీష్ హీరో అయ్యాడు. పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతుంది. ఓ అరడజను చిత్రాలు చేసినా ఆయనకు బ్రేక్ రాలేదు. మెగా ఫ్యాన్స్ కి కూడా ఆయన దగ్గర కాలేకపోయాడు. బన్నీ దూసుకుపోతుండగా, శిరీష్ వెనకపడిపోయాడు. ఈ క్రమంలో అల్లు శిరీష్ తీవ్ర అసహనంలో ఉన్నారట. అన్న అల్లు అర్జున్, తండ్రి అల్లు అరవింద్ తన కెరీర్ గాలికి వదిలేశారని ఆవేదన చెందుతున్నాడట. అల్లు అర్జున్ తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని భావిస్తున్నాడట. ఈ కారణంతోనే శిరీష్ కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయారట. ప్రస్తుతం అతడు ముంబైలో ఉంటున్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.