Allu Sneha Reddy Shares Allu Arha Rain Dance Reel Video
Allu Sneha Reddy : అల్లు ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా విదేశాల్లోనే సందడి చేస్తూ ఉంది. ఈ మధ్యే వారు హైద్రాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. గత నెల రోజులకు పైగా అడవులు, ప్రకృతి, వన్య మృగాలు అంటూ ఇలా అల్లు ఫ్యామిలీ తిరుగుతూ వచ్చింది. పుష్ప పార్ట్ 2 కోసం సుకుమార్ ఓ వైపు కసరత్తులు చేస్తున్నాడు. అయితే బన్నీ మాత్రం ఇలా తన ఫ్యామిలీతో ఎంచక్కా టూర్ల మీద టూర్లు వేస్తున్నాడు. ఈ గ్యాప్‌లో ఫ్యామిలతో బన్నీ బాగానే చిల్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే బన్నీ బాడీలో చాలా మార్పులు వచ్చాయట. ఆ మధ్య బన్నీ లుక్స్ మీద కూడా ట్రోలింగ్స్ నడిచాయి.
అయితే బన్నీ మాత్రం తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక బన్నీ పిల్లలు అర్హ, అయాన్‌లు నెట్టింట్లో చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ ఇద్దరూ అన్నాచెల్లెళ్ల ఫోటోలు నెటిజన్లు తెగ ఆకర్షిస్తుంటారు. అందులోనూ అర్హ అయితే తన డాడీతో కలిసి చేసే అల్లరికి అందరూ ఫిదా అవుతుంటారు. బన్నీ అయినా, స్నేహారెడ్డి అయినా కూడా ఎక్కువగా అర్హకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా అర్హ వర్షంలో చిందులు వేసింది. తన లాన్ ఏరియా అంతా కూడా చక్కర్లు కొడుతోంది. వర్షం పడుతుండగా.. అర్హ ఇలా తడుస్తూ ఎంజాయ్ చేసింది.
Allu Sneha Reddy Shares Allu Arha Rain Dance Reel Video
ఈ వీడియోను ఓ రీల్‌గా చేసింది స్నేహారెడ్డి. ఈ వీడియోను స్నేహారెడ్డి తన రీల్‌గా షేర్ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముద్దు ముద్దుగా అర్హ పరిగెత్తడం చూసి బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతోన్నారు. మొత్తానికి బన్నీ ఇప్పుడు మాత్రం మరోసారి పాన్ ఇండియన్ రేంజ్‌లో అదరగొట్టేందుకు చూస్తున్నాడు. పుష్ప పార్ట్ 2కి సంబంధించిన అప్డేట్లు వైరల్ అవుతున్నాయి. మొదటి పార్ట్‌లో తగ్గేదేలే క్లిక్ అవ్వడంతో.. రెండో పార్ట్‌లోనూ అలాంటిది ఏదో ఒక పెట్టాలని అనుకుంటున్నారట. కుమ్మేస్తా అని పెడదామనే ఆలోచనలో సుకుమార్ ఉన్నాడట. అంతే కాదు పార్ట్ 3 కూడా తీయబోతోన్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.