Amala Paul : ప్రముఖ దర్శకుడి జీవితంలో చిచ్చు రేపిన అమలాపాల్..!
Amala Paul : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ తన పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే వాటన్నటినీ తట్టకుని నటిగా దూసుకుపోతున్నది. తమిళ్, తెలుగుతో పాటు హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేస్తున్న ఈ భామ.. ఆంథాలజీలు, వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్‌లోనూ నటిస్తున్న అమలాపాల్.. టాలీవుడ్ స్టార్ హీరోలతోనూ యాక్ట్ చేసింది. కాగా, తాజాగా ఈ భామ ఓ దర్శకుడి జీవితంలో చిచ్చు రేపిందని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.అమలాపాల్ సాఫ్ట్ రోల్స్ చేయడంతో పాటు బోల్డ్ రోల్స్ ప్లే చేయడంలోనూ ముందుంటుంది.
అలా బోల్డ్ క్యారెక్టర్స్ ప్లే చేసి తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది ఈ సుందరి. అయితే, ఇటీవల ఈ భామ వెబ్ సిరీస్‌లో చేసిన పాత్ర గురించి సోషల్ మీడియాతో పాటు సినిమా సర్కిల్స్ లో డిస్కషన్ జరుగుతోంది. సదరు వెబ్ సిరీస్‌లో అమలాపాల్ ప్లే చేసిన క్యారెక్టర్ వెరీ బోల్డ్ క్యారెక్టర్ కాగా, దాని ప్రభావం అందులో నటించిన హీరో, డైరెక్టర్ పైన పడిందట.అలా వెబ్ సిరీస్‌లో అమలాపాల్ నటించడం వలన సదరు ఫేమస్ డైరెక్టర్ మ్యారేజ్ లైఫ్‌లో ఇక్కట్లు మొదలయ్యాయని తెలుస్తోంది.స్టోరి డిమాండ్ ప్రకారమే ఆమె నటించినప్పటికీ అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిందని కొందరు అంటున్నారు.

amala paul created an issue in star director s life
Amala Paul : క్యారెక్టర్స్ ప్లే చేయడంతో ముందుంటున్న అమలాపాల్..!
అమలాపాల్ అలా గ్లామర్ డోస్ బాగా పెంచేయడం వల్లే ఇదంతా జరిగిందన్న ఆరోపణలున్నాయి. అయితే, ఈ విషమయై నెట్టింట బోలెడన్ని వార్తలొస్తున్నప్పటికీ అఫీషియల్‌గా మాత్రం ఎవరూ ధ్రువీకరించడం లేదని తెలుస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. అమలా పాల్ రోల్స్ ప్లే చేయడంలో అస్సలు వెనుకడగు వేయదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ‘ఆమె’లో అమలాపాల్ నటించింది. ఇందులో ఆమె నటనకుగాను విమర్శకుల నుంచీ ప్రశంసలు లభించాయి.