Amala Paul : ఫెస్టివల్ సందర్భంగా తన కొడుకుతో క్యూట్ పిక్స్ షేర్ చేసిన అమలాపాల్
Amala Paul : తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో కథానాయికగా నటించి పేరు తెచ్చుకున్న నటి అమలా పాల్ తల్లైన విషయం తెలిసిందే. ఆమె ముందుగా తమిళ దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడింది . వివాహం తరువాత విభేదాల కారణంగా వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత ట్రావెలింగ్, యోగా, యాక్టింగ్, ఆధ్యాత్మిక ప్రయాణం అంటూ రోజుల తరబడి గడిపే నటి అమలా పాల్ తన చిరకాల మిత్రుడు జగత్ దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే తాను గర్భవతి అని ప్రకటించింది అమలా పాల్…

Amala Paul : ఫెస్టివల్ సందర్భంగా తన కొడుకుతో క్యూట్ పిక్స్ షేర్ చేసిన అమలాపాల్
Amala Paul పిక్స్ అదుర్స్…
ఇక గత ఏడాది జూన్ 11 న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు శిశువుకు ఆకు అని పేరు పెట్టినట్లు తన అభిమానులకు ప్రకటించింది. పార్థాల్ ప్రకారం ఆకు అనే పేరు హీబ్రూ పేరు. తమిళంలో ఆ పేరుకు స్వర్గం, ఆకాశం అని అర్థం. ఇక పెళ్లైన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న అమలాపాల్ తన గ్లామర్‌కి పదును పెడుతూ మత్తెక్కిస్తుంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తెలుగులో చేసిన సినిమాలు సూపర్ హిట్ కాగా.. ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం రాలేదు.