Heroine : విడాకుల తర్వాత గర్భవతైన హీరోయిన్.. కారణం ఎవరో..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heroine : విడాకుల తర్వాత గర్భవతైన హీరోయిన్.. కారణం ఎవరో..?

 Authored By ramu | The Telugu News | Updated on :1 June 2025,6:00 pm

Heroine  : తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు సంపాదించిన హీరోయిన్ అమలా పాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శకుడు విజయ్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమలా పాల్..కొద్దీ నెలలకే విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత సినిమాల్లో తిరిగి అడుగుపెట్టి గ్లామర్ పాత్రలతో మెప్పించడం స్టార్ట్ చేసింది.

అలాగే విడాకుల తర్వాత అమలా పాల్.. ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌తో ప్రేమలో పడి, కొంతకాలం డేటింగ్ చేసిన అనంతరం, అతనినే పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించింది. అంతే కాదు పెళ్లికి ముందే తాను గర్భవతి అయినట్లు స్వయంగా వెల్లడించింది. అందుకే పెద్దగా వేడుకలు లేకుండా తక్షణమే పెళ్లి చేసుకున్నట్లు పేర్కొంది. ఆమె బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్ల నుంచి విభిన్న స్పందనలు వచ్చాయి.

Heroine విడాకుల తర్వాత గర్భవతైన హీరోయిన్ కారణం ఎవరో

Heroine : విడాకుల తర్వాత గర్భవతైన హీరోయిన్.. కారణం ఎవరో..?

తాజాగా అమలా పాల్ తన కుమారుడు అన్వర్‌కు క్రైస్తవ సంప్రదాయ ప్రకారం బాప్టిజం (మతబోధ) కార్యక్రమం నిర్వహించడంతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని ఆసక్తిగా చర్చిస్తున్నారు. కొంతమంది ఇది వ్యక్తిగత స్వేచ్ఛ అని అభిప్రాయపడితే, మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది