Amala Paul : నాలోపల ఉన్నదాన్ని చూడండి.. వామ్మో అమలా పాల్ అంత మాట అనేసిందేంటి?
Amala Paul : అమలా పాల్ ఇప్పుడు నెట్టింట్లో చేస్తోన్న అందాల జాతర ఎలా ఉంటుందో అందరూ చూస్తున్నారు. రకరకాల ఫోటో షూట్లతో అమలా పాల్ ఇప్పుడు మామూలుగా హల్చల్ చేయడం లేదు. తాజాగా అమాల పాల్ వరుస ఫోటో షూట్లతో దుమ్ములేపుతోంది. అంతే కాకుండా అమలా పాల్ వెరైటీ కొటేషన్లతో హల్చల్ చేస్తోంది. మొన్నటికి మొన్న ఏదో ఆట ఆడుతున్నట్టుగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇక నిన్నా మొన్నా అయితే ఎక్కడో వెకేషన్లో దుమ్ములేపుతోన్నట్టు కనిపిస్తోంది.

amala paul enjoys vacation on her birthday
అమ్మాయిలోని రాక్షసత్వాన్ని చూసి ఈ ప్రపంచం బెదిరిపోతోంది.. కానీ అమ్మాయిలోని దైవత్వాన్ని చూసి మరింత భయపడతారు.. ఒక వేళ లోపల ఉన్న ఆ దైవత్వం బయటకు వస్తే.. చెడు అంతం అవుతుంది.. నాలోపల ఉన్న ఆ దైవత్వాన్ని చూడమంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.. రండి చూడండి.. అంటూ తన బర్త్ డేను ఎలా ఎంజాయ్ చేసిందో చూపించింది అమలా పాల్. మొత్తానికి పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ మాత్రం దుమ్ములేపేసింది
Amala Paul అందాల ఆరబోతతో అమలా పాల్..

amala paul enjoys vacation on her birthday
అయితే అమలా పాల్ మాత్రం ఇప్పుడు పర్సనల్ లైఫ్‌ను దూరం పెట్టేసింది. మొదటి పెళ్లి పెటాకులు అయింది. దర్శకుడు విజయ్‌తో అమలా పాల్ విడాకుల అనంతరం.. సింగర్‌తో పెళ్లి జరిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని చెప్పేసింది. ఇక ఇప్పుడు కెరీర్ మీద అమలా పాల్ ఫోకస్ పెట్టేసింది. మొన్నటికి మొన్న కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్‌తో ఆహాలో సందడి చేసింది అమలాపాల్. ఇక ఓటీటీ కంటెంట్లకు అమలా పాల్ వరుసగా ఓకే చెబుతోన్నట్టుంది.