Bigg Boss Telugu 7 : ఇది మాకు కావాల్సింది. బిగ్ బాస్ లోకి రాకముందు సీరియల్ నటుడు అమర్ దీప్ గురించి చాలామంది చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ.. ఎందుకో అమర్ దీప్ వాటికి రీచ్ కాలేకపోయాడు. మొదటి వారం నుంచే శివాజీ, ప్రశాంత్ మీద కోపం పెట్టుకొని తన గేమ్ కూడా సరిగ్గా ఆడలేకపోయాడు. నామినేట్ అయిన ప్రతిసారి ఏదో తనకు ఉన్న ఫ్యాన్స్ బేస్ వల్ల సేవ్ అవుతున్నాడు కానీ.. ఆ ప్లేస్ లో వేరే వాళ్లు ఉంటే ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేవారు. అవును.. బిగ్ బాస్ సీజన్ 7 లో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే అందరూ అమర్ దీప్ పేరే చెప్పారు. అది కూడా ఐదు వారాలకే. ఏదో సేవ్ అయ్యాడు కానీ.. లేకపోతే ఎప్పుడో ఎలిమనేట్ అయ్యేవాడు. అమర్ దీప్ కు బుర్ర లేదు.. ఫిజికల్ గా బలం కూడా లేదు. అమర్ దీప్ గురించి ఎంతో ఊహించుకున్నాం. కానీ.. ఇక్కడికి వచ్చి మాత్రం పేలవంగా ఆడుతున్నాడు. ప్రియాంక, శోభాశెట్టి, సందీప్.. ఈ ముగ్గురి చుట్టూ తిరిగి పాడైపోయాడు అని చాలామంది చెప్పుకొచ్చారు.
హోస్ట్ నాగార్జున కూడా చాలా సార్లు అమర్ దీప్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రతి వారం కూడా వచ్చే వారం నుంచి ఇంప్రూవ్ అవుతా.. నా సత్తా చూపిస్తా అంటూ గప్పాలు కొట్టడమే కానీ.. ఐదు వారాల్లో మనోడి ప్రతిభ మాత్రం ఏం కనిపించలేదు బిగ్ బాస్ కు. కానీ.. ఎప్పుడైతే బిగ్ బాస్ 2.0 స్టార్ట్ అయిందో.. హౌస్ లోకి ఎప్పుడైతే కొత్త వాళ్లు వచ్చారో.. ఇక అమర్ దీప్ మాత్రమే కాదు.. ప్రియాంక, సందీప్, శోభా శెట్టి అందరూ శివాజీ గ్రూప్ కు చేరిపోయారు. ఎందుకంటే కొత్త వాళ్లతో పోటీ పడాలంటే పాత వాళ్లు అందరూ కలిసిపోవాల్సిందే. శివాజీ గ్రూప్ లో చేరాక అమర్ దీప్ చాలా మారిపోయాడు. ప్రశాంత్ తోనూ బాగా ఉంటున్నాడు. ఇదివరకు ప్రశాంత్ ను చాలా ఇన్ సల్ట్ చేశాడు అమర్ దీప్. కానీ.. ఇప్పుడు అలా లేదు. అమర్ దీప్ చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నాడు. ఏది ఏమైనా ఈ మార్పు మంచిదే.. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో కూడా అమర్ దీప్ చాలా ఉత్సాహంగా కనిపించాడు.
తాజాగా బిగ్ బాస్ స్మార్టెస్ట్ అనే టాస్క్ ను పెడతాడు. అందులో అమర్ దీప్ చాలా బాగా ఆడాడు. చాలా యాక్టివ్ గా బిగ్ బాస్ అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూ రచ్చ రచ్చ చేశాడు. అమర్ దీప్ ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందరినీ నవ్విస్తూ తను నవ్వుతుంటే చాలా బాగుంది. బిగ్ బాస్ 2.0 తర్వాత అమర్ దీప్ గేమ్ లో చాలా మార్పు వచ్చింది. అమర్ బాగా యాక్టివ్ అయ్యాడు. రోజురోజుకూ అమర్ దీప్ గ్రాఫ్ పెరుగుతోంది. అతడిది చైల్డిష్ మెంటాలిటీ.. కానీ.. అంత కన్నింగ్ కాదు.. మంచి పర్సన్.. ప్యూర్ సోల్ అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఇక ఇంటి విషయాలకు వస్తే.. ప్రశాంత్ కెప్టెన్సీ పోయింది. ఈ వారం కొత్త కెప్టెన్ వచ్చే చాన్స్ ఉంది. నిన్నటి టాస్కులలో కొన్ని ఆటగాళ్లు, కొన్ని పోటుగాళ్లు గెలుచుకున్నారు. ఈ గేమ్స్ లో ఏ గ్రూప్ ఎక్కువ పాయింట్లు సాధిస్తే.. ఆ గ్రూప్ నుంచి కెప్టెన్ గా కంటెండర్స్ వచ్చే చాన్స్ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.