Home » Entertainment » Vijay Devarakonda Fans Trolls Rashmika Mandanna
Entertainment

Rashmika Mandanna : ఒక్క పాటలో ఇన్ని ముద్దులా..? రష్మిక ని తిడుతున్న విజయ్ ఫ్యాన్స్..

Authored By
aruna
The Telugu News | Published on: October 12, 2023, 2:00 pm
Advertisement

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా రష్మిక మందన నటించిన బాలీవుడ్ సినిమా ‘ యానిమల్ ‘ మూవీ గురించి ఒక ఆసక్తికర అప్డేట్ విడుదలైంది. అయితే ఈ సినిమాలో రష్మిక హీరోతో లిప్ లాక్ సీన్లలో బాగా రెచ్చిపోయింది. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు రష్మిక మందనను తెగ తిడుతున్నారు. మనకు తెలిసిందే రష్మిక మందన, విజయ్ దేవరకొండ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుంది ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఈ జంట కూడా ఏమీ స్పందించకపోవడంతో ఇది నిజమే అనుకుంటున్నారు.

Advertisement

అయితే విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. రష్మికను ఏకంగా వదినమ్మ అంటూ సంతోషపడతారు. అలాంటి వదినమ్మ ఇలా పరాయి మగాడితో ముద్దులు పెడుతూ ఉంటే ఏ అభిమాని అయిన చూస్తూ తట్టుకోగలడా అందుకే సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ హద్దులుమీరీ పోయి రష్మికను ట్రోల్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు రష్మిక విజయ్ సొంతం అనుకున్నామని కనిపించిన ప్రతి ఒక్క హీరోకి ముద్దులు పెడుతూ ఉంటే ఎలా అంటూ ఫైర్ అయిపోతున్నారు. రీసెంట్ గా రష్మిక మందన రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మొదటి పాటను విడుదల చేశారు.

Vijay Devarakonda fans trolls Rashmika Mandanna

Advertisement

ఈ పాటలో రష్మిక, రన్బీర్ కపూర్ లిప్ లాక్ సీన్ లతో రెచ్చిపోయారు. మరి ముఖ్యంగా ఫ్లైట్లో రణ్బీర్ కపూర్ , రష్మిక మందన మధ్య వచ్చిన సన్నివేశాలు చూడటానికి అభిమానుల గుండెల్లో మంట పెట్టే విధంగా ఉన్నాయి. ఆ ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఉంటే సినిమా సూపర్ హిట్ అయి ఉండేది కానీ ఆ ప్లేస్ లో రణబీర్ కపూర్ ను ఊహించుకోలేకపోతున్నారు విజయ్ అభిమానులు. దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందనను విజయ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు ఒక పాటలో ఇన్ని ముద్దులా అని ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక మందన గురించి ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి