Amardeep Surprise Gift To Tejaswini Gowda
Tejaswini Gowda : అమర్ దీప్, తేజస్విని గౌడల ప్రేమ గురించి ఎవ్వరికీ తెలియకుండా అలా సాగింది. వారిద్దరూ తమ నిశ్చితార్థపు ఫోటోలు బయటకు పెట్టే వరకు ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియలేదు. అంటే అంత సీక్రసీ మెయింటైన్ చేశారన్న మాట. వీరి ప్రేమ గురించి ఎక్కడా కూడా వార్తలు రాలేదు. ఈ ఇద్దరూ కలిసి కనిపించినట్టుగా కూడా ఎక్కడా ఫోటోలు బయటకు రాలేదు. మొత్తానికి ఈ జోడి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోయిలమ్మ, కేరాఫ్ అనసూయ సీరియల్స్‌తో తేజస్వీని ఫేమస్ అవ్వగా.. జానకి కలగనలేదు సీరియల్‌తో రామచంద్రగా అమర్ దీప్ ఫేమస్ అయ్యాడు. మొత్తానికి ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ విషయం మాత్రం నెట్టింట్లో తెగ చర్చ నడిచింది. వారి ఫోటోలు బాగానే ట్రెండ్ అయ్యాయి.
ఇక ఈ ఎంగేజ్మ్ంట్ బెంగళూరులో జరిగింది. ఎంగేజ్మెంట్‌కు వెళ్తూ వెళ్తూ మధ్యలొనే ఓ వ్లాగ్ చేసింది విష్ణప్రియ. అంటే జానకి కలగనలేదు ఫేమ్ మల్లిక. మొత్తానికి తేజస్వీని, అమర్ దీప్‌ల ప్రేమ కథ మాత్రం ఈ మధ్యే మొదలైందని, వెంటనే పెళ్లికి కూడా రెడీ అయ్యారని మల్లిక వీడియోలో అర్థమైంది. ఇక అమర్ దీప్ తల్లి సైతం తన కోడలి పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఆ వీడియోలో చూపించేసింది. ఇప్పుడు ఈ ఇద్దరు కొత్త జంట. వినాయక చవితికి చేయబోయే ఈవెంట్‌లో ఈ జంటే హైలెట్ కానుంది. మాతో పండుగే పండుగ అంటూ స్టార్ మాలో రాబోతోన్న ఈ ఈవెంట్‌లో అమర్ దీప్, తేజస్వీని హైలెట్ అయ్యారు. ఇక అమర్ దీప్ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్‌కు తేజస్విని కంటతడి పెట్టేసింది.
Amardeep Surprise Gift To Tejaswini Gowda
అమర్ దీప్ తాను మొదటగా ఎలా ప్రపోజ్ చేశాడో.. ఏమని చెప్పాడో కూడా అందరి ముందు స్టేజ్ మీదే చెప్పేశాడు. ఇక తేజస్విని తల్లిని స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. తల్లితో పాటు చనిపోయిన తండ్రి మైనపు విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో తేజస్విని స్టేజ్ మీదే విలవిలా ఏడ్చేసింది. భర్త ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా అందిస్తావ్ అని నాకు నమ్మకం వచ్చింది అంటూ అమర్ దీప్ మీద తేజస్విని తల్లి ప్రశంసలు కురిపించింది. ఇక తండ్రిని అలా చూసి తేజస్విని కన్నీరు కార్చడంతో ప్రేక్షకుల గుండెలు బరువెక్కేశాయి.
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
This website uses cookies.