Rashmika mandanna : రష్మిక మందన్న హాట్ వీడియో పై స్పందించిన అమితాబచ్చన్.. కేస్ పెట్టాలంటూ కామెంట్స్ ..??

Authored By aruna | The Telugu News | Updated on : 6 November 2023, 7:23 pm
  •  Rashmika mandanna : రష్మిక మందన్న హాట్ వీడియో పై స్పందించిన అమితాబచ్చన్..

  •  కేస్ పెట్టాలంటూ కామెంట్స్ ..??

Rashmika mandann : తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పై అమితాబచ్చన్ స్పందించారు. ఇలాంటి వీడియోల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్ చేశారు. రష్మిక మందన ఇండియాలోనే టాప్ హీరోయిన్స్ లలో ఒకరు. సౌత్ నార్త్ లో పలు భాషలలో సినిమాలు చేస్తున్నారు. ఆమె ఖాతాలో ఇప్పటికే చాలా హిట్స్, బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రష్మిక మందన చాలా బోల్డ్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో చర్చకు దారి తీసింది. అయితే ఇది ఒరిజినల్ వీడియో కాదు.

ఈ వీడియోలో ఉంది అసలు రష్మిక నే కాదు. ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేసి నెట్టింటా షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఓ జర్నలిస్ట్ హైలెట్ చేశారు. రష్మిక పేరుతో ఫేక్ వీడియో వైరల్ అవుతుంది. ఇది చాలా సీరియస్ విషయం. ఇలాంటి తప్పుడు చర్యలను ఈజీగా తీసుకోకూడదు. వీటిపై కఠిన చట్టాలు తీసుకురావాలి అంటూ ఆయన ట్వీట్ వేశారు. ఫేక్ వీడియో తో పాటు ఒరిజినల్ వీడియో కూడా పోస్ట్ చేశారు. అయితే జర్నలిస్ట్ ట్వీట్ పై స్పందించిన అమితాబచ్చన్ అవును ఇది చట్టం చర్యలు తీసుకోవాల్సిన సీరియస్ కేస్ అని కామెంట్ చేశారు. ఒరిజినల్ వీడియోలో ఉన్న అమ్మాయి పేరు జరా పటేల్. ఈమె భారతీయ మూలాలు ఉన్న బ్రిటిష్ యువతి.

ఈమె అక్టోబర్ 9న తన వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉన్న జరా పటేల్ మొఖం రష్మిక లాగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చాలామంది ఈ వీడియోలో నిజంగానే రష్మిక ఉందని భావిస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమితాబ్ వంటి నటులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఇక పోతే రష్మిక అమితాబ్ కలిసి ‘ గుడ్ బై ‘ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం రష్మిక పుష్ప 2, యానిమల్ వంటి భారీ సినిమాలలో నటిస్తున్నారు.

Advertisement

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి