Prabhas : దీపికా చేయి పట్టుకున్న ప్రభాస్.. పక్కకి లాగేసిన అమితాబ్
Prabhas : సినీ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్‍కు రెడీ అయింది. భారత పురాణాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. గ్లోబల్ రేంజ్‍లో అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం వస్తోంది. జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జూన్ 19 నముంబైలో జరిగింది. ప్రభాస్, నాగ్ అశ్విన్ తో పాటు సినిమాలో కీలక పాత్రలలో… నటిస్తున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు… కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.బాహుబలి సమయం నుండి.. ప్రభాస్ కి స్నేహితుడు అయిన రానా దగ్గుబాటి.. ఈ ఈవెంట్ లో హోస్ట్ గా ఇంప్రెస్స్ చేశారు.
దీపిక ప్రస్తుతం గర్భిణిగా ఉన్నా ఈ ఈవెంట్‍కు వచ్చారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కనిపించలేదు. ఈ ఈవెంట్‍కు హోస్ట్ చేశారు హీరో దగ్గుబాటి రానా. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలతో కలిసి నటించడం గురించి చెప్పాలని ప్రభాస్‍ను రానా అడిగారు. దీంతో తాను ప్రభాస్ కాళ్లు మొక్కుతానంటూ టీజ్ చేశారు అమితాబ్. ఆ తర్వాత ప్రభాస్ అసలు విషయం చెప్పారు. తాను అమితాబ్‍కు పాదాభివందనం చేశానని.. ఇంకోసారి అలా చేయవద్దని ఆయన తెలిపారు. “నేను తొలిసారి కలిసినప్పుడు అమితాబ్ బచ్చన్ కాళ్లకు నమస్కరించాను. అయితే అలా చేయద్దని అమితాబ్ వారించారు. ఇంకోసారి అలా చేస్తే నేను కూడా అలా చేస్తానని అమితాబ్ అన్నారు. ప్లీజ్ నేను అలా ఆలోచన కూడా చేయలేను” అని ప్రభాస్ చెప్పారు.
Prabhas : దీపికా చేయి పట్టుకున్న ప్రభాస్.. పక్కకి లాగేసిన అమితాబ్
ఇక ఈవెంట్ లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దీపికా పదుకోన్ గర్భవతి అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె మెల్లిగా స్టేజీపైకి నడుచుకుంటూ వచ్చారు. మూవీ గురించి మాట్లాడిన తరువాత స్టేజీ పై నుంచి కిందకు దిగుతున్నారు. ఈ సమయంలో ప్రభాస్ వచ్చి ఆమెకు సాయం చేశాడు. ఆమె చేతిని పట్టుకుని మెల్లిగా నడిపించే ప్రయత్నం చేయగా.. ప్రభాస్ వెనకనే వచ్చిన అమితాబ్ బచ్చన్ ప్రభాస్‌ను పక్కకు జరిపి ఆమె చేతిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.