Oats : ఒకప్పుడు ఓట్స్ అంటే ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం ఓట్స్ అంటే చాలా మంది ఎంతో ఇష్టం గా తింటున్నారు. అయితే చాలా మంది డైట్ లో భాగంగా బరువు తగ్గించుకోవడం కోసం ఓట్స్ ను తినడానికి ఇష్టపడుతున్నారు. ఓట్స్ ఆరోగ్యానికి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. కానీ ఓట్స్ ని అధికంగా తీసుకోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి ఈ ఓట్స్ అందరికీ అంత మంచిది కాదు అని అంటున్నారు. వాటిని అధికంగా తీసుకోవటం వలన విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఓట్స్ లో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను ఎంతగానో మెరుగుపరుస్తుంది. కానీ ఇది కొంతమందిలో గ్యాస్, కడుపు ఉబ్బరానికి కూడా దారితీస్తుంది అది తెలిపారు. అంతేకాక కొంతమందిలో కడుపునొప్పి మరియు మలబద్ధకానికి కూడా దారి తీస్తుంది.ఈ ఓట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వలన జరిగే అనర్ధాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఓట్స్ ను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా తినే ఎంతో మంచి పోషకాహారం. ప్రధానంగా ఓట్స్ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం. కానీ కొంతమందికి ఓట్స్ తినటం వలన వాపు,దురద, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. సాధారణంగా రోజుకి ఒక కప్పు ఓట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఓట్స్ ను ఆరోగ్యకరమైన ఆహారంతో కలిపి తీసుకుంటే మంచిది. ఓట్స్ అనేవి ఫైబర్ మరియు ఇతర పోషకాలను అందిస్తుంది. ఓట్స్ ను తయారు చేసుకునేటప్పుడు కొవ్వు లేక చెక్కరను అసలు కలపకూడదు. ఇలా చేయటం వలన క్యాలరీల కంటెంట్ అనేది ఎంతో పెరుగుతుంది.
కొంత మందికి ఓట్స్ అనేవి జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. సాధారణంగా ఓట్స్ అనేవి గ్లూటెన్ రహితంగా ఉంటాయి. కొన్ని సార్లు కర్మాగారాలలో ఓట్స్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు, వాటిని ఇతర గ్లూటెన్ కలిగినటువంటి ధాన్యాలతో కలుపుతున్నారు. వాటిలో ఉన్న గ్లూటెన్ ను జీర్ణించుకోలేని వ్యక్తులకు అనారోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.