వైష్ణవి చైతన్య – విజయ్ దేవరకొండ తమ్ముడు మధ్య ఏం నడుస్తోంది ? లీక్ అయిన వీడియో? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

వైష్ణవి చైతన్య – విజయ్ దేవరకొండ తమ్ముడు మధ్య ఏం నడుస్తోంది ? లీక్ అయిన వీడియో?

టాలీవుడ్ లో ‘ దొరసాని ‘ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. తన అన్న విజయ్ దేవరకొండకు ఉన్న స్టార్ ఇమేజ్ తో ఆనంద్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక మొదటి సినిమా ఊహించినంత స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఆనంద్ దేవరకొండకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం సినిమాతో పాపులర్ అయ్యాడు. అయితే ఆనంద్ లేటెస్ట్ గా ఓ నటితో రొమాన్స్ చేస్తున్న వీడియో […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 July 2023,2:00 pm

టాలీవుడ్ లో ‘ దొరసాని ‘ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. తన అన్న విజయ్ దేవరకొండకు ఉన్న స్టార్ ఇమేజ్ తో ఆనంద్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక మొదటి సినిమా ఊహించినంత స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఆనంద్ దేవరకొండకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం సినిమాతో పాపులర్ అయ్యాడు. అయితే ఆనంద్ లేటెస్ట్ గా ఓ నటితో రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ యంగ్ హీరో ‘ బేబీ ‘ అనే సినిమాలో హీరోగా నటించాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య నటించింది. వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో కలిసి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే షార్ట్ ఫిలింలో నటించింది. దీంతో వైష్ణవి చాలా ఫేమస్ అయ్యింది. దీని కారణంగానే ఆమెకి సినీ అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ నటిస్తున్న బేబీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటికే పరిచయం చేశారు. సినిమాలోని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Anand devarakonda rmance video

Anand devarakonda rmance video

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ ఓ వేదికపై సందడి చేశారు. వీరిద్దరూ కలిసి బొమ్మరిల్లు స్పూఫ్ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బయటనే ఇలా చేశారంటే సినిమాలో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తారో అని జనాలు చర్చించుకుంటున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ను ఎస్ఆర్ కే దర్శకత్వం వహిస్తున్నారు. లవ్, రొమాన్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా 23న విడుదల కానుంది. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్లు ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది