Anant Ambani : ఏకంగా కోళ్ల కోసం లారీనే కొనేసిన అనంత్ అంబాని.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్.. వీడియో !
ప్రధానాంశాలు:
Anant Ambani : ఏకంగా కోళ్ల కోసం లారీనే కొనేసిన అనంత్ అంబాని.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..!
Anant Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముకేష్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జామ్‌నగర్ నుండి ద్వారక వరకు 140 కి.మీ పాదయాత్ర సమయంలో చోటు చేసుకున్న ఒక ఘటన ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే అతను తన నడక ప్రయాణం మధ్యలో వందలాది కోళ్లను రెట్టింపు ధరకి కొనుగోలు చేయడంతో తన పాదయాత్రని మరింత ఆనందంగా మార్చాడు.

Anant Ambani : ఏకంగా కోళ్ల కోసం లారీనే కొనేసిన అనంత్ అంబాని.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..!
అనంత్ అంబానీ తన నడక ప్రయాణం మధ్యలో కోళ్లను రెట్టింపు ధరకు కొనుగోలు చేసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా, అనంత్ ప్రతి రాత్రి 10-12 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే 60 కి.మీ యాత్ర పూర్తి చేసుకున్నారు. గట్టి భద్రత మధ్య నడక సాగిస్తున్నారు. ఏప్రిల్ 10న తన 30వ పుట్టినరోజుకు ముందు ద్వారకకు చేరుకుని శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందాలనేది యాత్ర లక్ష్యం.
పాదయాత్ర మధ్యలో ఓ కోళ్ల లారీ అనంత్ అంబానీ దృష్టిలో పడుతుంది. వెంటనే లారీ ఆపిస్తాడు. కోళ్ల మందను రక్షిస్తాడు. పెద్ద లారీ వెనకాల ఒక కోడిని పట్టుకుని, లోపల అనేక కోళ్లు ఉన్నట్లు చూడవచ్చు. అనంత్ అంబానీ చుట్టూ భద్రతా సిబ్బంది ఉంటారు. అన్ని కోళ్లను రక్షించమని ఆదేశిస్తున్నట్లు కనిపిస్తుంది. పక్షుల యజమానికి ఎటువంటి నష్టం జరగకుండా వాటిని రక్షించడానికి కూడా అతను ఆ వ్యక్తికి ఆదేశిస్తాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జంతు సంక్షేమ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి “ప్రాణి మిత్ర” అవార్డుతో సత్కరించింది.
View this post on Instagram