Anantha Sriram Comments On Garikapati At God Father Blockbuster Success Meet
Ananta Sriram : ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత మంచి పేరు ఉన్నదని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా మారారు. ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండి చూసుకుంటారని కొందరు అంటుంటారు. ఇదిలాఉంటే మరికొందరు మాత్రం చిరు కుటుంబం ఇండస్ట్రీని గ్రిప్‌లో పెట్టుకుని నడిపిస్తోందని, వారి కుటుంబం, సన్నిహితులు, బంధువులకు మినహా కొత్తవారికి అవకాశం ఇవ్వరని కూడా టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా నేపథ్య గాయకుడు అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ప్రవచనాలు చెప్పే గరికపాటి నరసింహరావును పరోక్షంగా విమర్శించారు.అందుకోసం కాకి, సీతారాముడు,గరికను ఉదాహరణగా ఎంచుకున్నాడు. ఒకవేదికను పంచుకున్నంత మాత్రన అందరూ ఒకే స్థాయికి చెందిన వారు కాదని, మన అంతస్తు ఎంటి అనేది చూసుకుని మాట్లాడాలని హితవు పలికాడు. రాముడు ముట్టుకున్నంత మాత్రాన గరికకు గొప్పదనం రాదు. ఆ ఘనత మొత్తం రాముడికే చెందుతుందని పరోక్షంగా కౌంటర్స్ వేశాడు.
Anantha Sriram Comments On Garikapati At God Father Blockbuster Success Meet
మెగాస్టార్ చిరంజీవిని అవమానించినా కూడా చిరు ఏం మాట్లాడకుండా ఉన్నారంటే అది ఆయన గొప్పదనం అని చెప్పుకొచ్చాడు. అంతేకానీ నలుగురు నన్ను ఆదరిస్తున్నారు. చిరు నేను ఒక్కటే స్టేజిమీద కూర్చుంటే ఇద్దరూ ఒక్కటి అయిపోరని పేర్కొన్నాడు. అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవిని అవమానించిన విషయం తెలిసిందే. ఫోటో సెషన్ ఆపకపోతే నేను వెళ్లిపోతానని అనడంతో చిరు మౌనంగా వచ్చి కూర్చున్నారు. ఇదే విషయంపై అటు నాగబాబు, రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. తాజాగా అనంతశ్రీరామ్ కూడా కౌంటర్లు వేయడంతో మెగాఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అవుతున్నారు.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.