Ananta Sriram : గరికపాటికి రైటర్ అనంత శ్రీరామ్ అదిరిపోయే కౌంటర్.. ఎగిరెగిరి పడొద్దంటూ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ananta Sriram : గరికపాటికి రైటర్ అనంత శ్రీరామ్ అదిరిపోయే కౌంటర్.. ఎగిరెగిరి పడొద్దంటూ..?

 Authored By mallesh | The Telugu News | Updated on :11 October 2022,8:30 pm

Ananta Sriram : ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత మంచి పేరు ఉన్నదని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా మారారు. ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండి చూసుకుంటారని కొందరు అంటుంటారు. ఇదిలాఉంటే మరికొందరు మాత్రం చిరు కుటుంబం ఇండస్ట్రీని గ్రిప్‌లో పెట్టుకుని నడిపిస్తోందని, వారి కుటుంబం, సన్నిహితులు, బంధువులకు మినహా కొత్తవారికి అవకాశం ఇవ్వరని కూడా టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా నేపథ్య గాయకుడు అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ప్రవచనాలు చెప్పే గరికపాటి నరసింహరావును పరోక్షంగా విమర్శించారు.అందుకోసం కాకి, సీతారాముడు,గరికను ఉదాహరణగా ఎంచుకున్నాడు. ఒకవేదికను పంచుకున్నంత మాత్రన అందరూ ఒకే స్థాయికి చెందిన వారు కాదని, మన అంతస్తు ఎంటి అనేది చూసుకుని మాట్లాడాలని హితవు పలికాడు. రాముడు ముట్టుకున్నంత మాత్రాన గరికకు గొప్పదనం రాదు. ఆ ఘనత మొత్తం రాముడికే చెందుతుందని పరోక్షంగా కౌంటర్స్ వేశాడు.

Anantha Sriram Comments On Garikapati At God Father Blockbuster Success Meet

Anantha Sriram Comments On Garikapati At God Father Blockbuster Success Meet

Ananta Sriram : అనంతశ్రీరామ్ గరిక, కాకి స్టోరీ భలే చెప్పాడుగా..

మెగాస్టార్ చిరంజీవిని అవమానించినా కూడా చిరు ఏం మాట్లాడకుండా ఉన్నారంటే అది ఆయన గొప్పదనం అని చెప్పుకొచ్చాడు. అంతేకానీ నలుగురు నన్ను ఆదరిస్తున్నారు. చిరు నేను ఒక్కటే స్టేజిమీద కూర్చుంటే ఇద్దరూ ఒక్కటి అయిపోరని పేర్కొన్నాడు. అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవిని అవమానించిన విషయం తెలిసిందే. ఫోటో సెషన్ ఆపకపోతే నేను వెళ్లిపోతానని అనడంతో చిరు మౌనంగా వచ్చి కూర్చున్నారు. ఇదే విషయంపై అటు నాగబాబు, రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. తాజాగా అనంతశ్రీరామ్ కూడా కౌంటర్లు వేయడంతో మెగాఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అవుతున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది