
Director Trivikram Shares Hilarious Moment With Prakash Raj
Trivikram : త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రదర్శకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాకముందు త్రివిక్రమ్, సునీల్ ఇద్దరూ కలిసి ఒకే రూమ్‌లో ఉండి అవకాశాల కోసం స్టూడియోలు తిరిగేవారని అప్పట్లో వీరిద్దరూ చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. ఇక సునీల్ కూడా చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తూ ఏకంగా కామెడీ ప్రపంచాన్ని కొన్నాళ్లు ఏలాడు. ఆ తర్వాత హీరో స్థాయికి చేరుకున్నాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా కింద నుంచి పైస్థాయికి చేరుకున్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలోనే అందివచ్చిన ప్రతి చాన్సును సద్వినియోగం చేసుకున్నాడు.త్రివిక్రమ్ కంటే సునీల్ ఇండస్ట్రీలో త్వరగా అడుగుపెట్టాడు. అనంతరం హీరోగా కొంతకాలం రాణించాడు.ఇక ప్రస్తుతం హీరో అవకాశాలు రాకపోకడంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా చేస్తూ వస్తున్నాడు. త్రివిక్రమ్ మాత్రం వరుసగా హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లుఅర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారిపోయాడు. అగ్రదర్శకులతో సమానంగా సినిమాలు చేస్తున్నాడు. త్రివిక్రమ్ కెరీర్‌లో ఒకటి రెండు ప్లాపులు ఉన్నా హిట్స్ మాత్రం చాలానే ఉన్నాయి.
Director Trivikram Shares Hilarious Moment With Prakash Raj
రీసెంట్‌గా త్రివిక్రమ్ నటించిన తొలిసినిమా నువ్వే నువ్వే 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్న ఈవెంట్ నిర్వహించారు. దీనికి దర్శకుడు త్రివిక్రమ్, హీరో తరుణ్, హీరోయిన్ శ్రియ, ప్రకాశ్ రాజ్ వంటి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. సునీల్, తాను కలిసి ప్రకాశ్ రాజ్‌ను ఎంత ఇబ్బంది పెట్టారో గుర్తుచేసుకున్నారు. అతని వాచెస్ లాక్కోవడం, రాత్రి పూట ఇంటికి వెళ్లి మందు బాటిల్స్ కొట్టేయడం వంటివి చేశామని చెప్పుకొచ్చారు. అయినప్పటికి తమ గోలను ప్రకాశ్ రాజ్ చాలా ఓపికగా భరించాడని, తామిద్దరం ఏదో ఒకటి అవుతామని ముందుగా ప్రకాశ్ నమ్మాడని త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
This website uses cookies.