Ananya Nagalla : నెత్తికి హ్యాట్, క‌ళ్ల‌కి అద్దాలు.. అన‌న్య నాగ‌ళ్ల‌ హంగామా మాములుగా లేదు..!

Authored By Sam C | The Telugu News | Published on: June 13, 2022, 5:30 pm

Ananya Nagalla : వ‌కీల్ సాబ్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ అన‌న్య నాగ‌ళ్ల‌. చూస్తుంటే చూడాలనిపించే అందం ఈ అమ్మ‌డి సొంతం. లోకల్ అమ్మాయే అయినా ఎక్కడా తగ్గకుండా వెళ్తోన్న ఈ అమ్మడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా టాలీవుడ్‌లో యమ ఫేమస్ అయిపోయింది. అంతేకాదు, ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకుంటోంది. దీంతో అనన్య పేరు కొంత కాలంగా మారుమ్రోగుతోంది. ఇక, సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ తెలుగమ్మాయి.. అందాలను ఆరబోస్తూ సంచలనం అవుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా అనన్య కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అనన్య నాగళ్ల తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మ‌ల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ ముందుకు వెళుతున్న అన‌న్య సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ ర‌చ్చ చేస్తుంటుంది. ప్ర‌స్తుతం వెకేష‌న్‌లో ఉన్న అన‌న్య నాగ‌ళ్ల క్యూట్ పిక్ షేర్ చేసింది. ఇందులో అన‌న్య గ్లామ‌ర్ కేక పెట్టించే విధంగా ఉంది. అమ్మ‌డి అంద‌చందాల‌కు మ‌తులు పోతున్నాయి.

ananya nagalla latest pics viral in instagram

ananya nagalla latest pics viral in instagram

Ananya Nagalla : అన‌న్య అరాచ‌కం..

అనన్య వకీల్ సాబ్‌తో పాటు యువ హీరో నితిన్ నటించిన మాస్ట్రో అనే సినిమాలో నటించారు. మాస్ట్రో హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వచ్చింది. ఈ తెలుగు రీమేక్‌కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp