Ananya Nagalla : అనన్య నాగళ్ల అదుర్స్…. యెల్లో డ్రెస్ లో కట్టిపడేస్తోంది..!
Ananya Nagalla : అనన్య నాగళ్ల తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మల్లేశం మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది… ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా అనన్య మన తెలుగు అమ్మాయి.
అలాగే అనన్య హీరో నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో నటించింది. మాస్ట్రో హిందీలో ఘన విజయాన్ని అందుకున్న అంధాధూన్ సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చింది. ఈ తెలుగు రీమేక్‌కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ప్లేబ్యాక్ చిత్రంలో నటించి మెప్పించింది. ఇప్పుడు అనన్య వరుస సినిమాలతో దూసుకుపోతుంది…. త్వరలో జయేష్ భాయ్ జోర్దార్ అనే చిత్రం త్వరలో మన ముందుకు రాబోతుంది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. ఆనన్య సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. ఫొటో షూట్ పిక్స్, వీడియో లు పోస్ట్ చేస్తుంటుంది… ఈ భామకు సోషల్ మీడియాలో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ప్రస్తుతం అనన్య నాగళ్ల గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తన నడుము ఒంపులతో కుర్రకారుని కట్టిపడేస్తోంది. వరుసగా తన గ్లామర్ పిక్స్ పంచుకుంటూ నెటిజన్లకి మరింత దగ్గరవుతోంది. తన అందం అభినయంతో అందరినీ కట్టిపడేస్తోంది. ప్రస్తుతం యెల్లో డ్రెస్ లో ఉన్న పిక్స్ వైరల్ గా మారాయి… శ్రీరామ నవమి సందర్భంగా అనన్య మరో సారి కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది. పసుపు రంగు చీర కట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. చూసే కొద్దీ చూడాలనిపించే అందం అనన్య సొంతం అంటున్నారు నెటిజన్లు.