Home » Entertainment » Anasuya And Susank Bharadwaj Early Morning Drink
Entertainment

Anasuya : భర్తతో చీర్స్ కొడుతూ రచ్చ.. అనసూయ భరద్వాజ్ మామూల్ది కాదు

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 7, 2021, 12:45 pm
Advertisement

Anasuya అనసూయ భరద్వాజ్ తన భర్త సుశాంక్ భరద్వాజ్‌తో చేసే అల్లరి, ఆడే సరసాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పబ్లిక్‌గానే ముద్దులు పెడుతుంటుంది. ఆ పెట్టిన ముద్దుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అలా అనసూయ చేసే అల్లరి, ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇక ఆమె తన భర్త బర్త్ డే సందర్బంగా గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ చేసినట్టు కనిపిస్తోంది. భర్తకు ఘాడంగా ఓ ముద్దు పెట్టి మరీ విషెస్ చెప్పింది.

Advertisement

Anasuya And Susank Bharadwaj Early Morning Drink

ఇక సాయంత్రం పూట రెస్టారెంట్‌కు వెళ్లి ఫ్యామిలీ అంతా కూడా బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపించింది. అయితే అనసూయ, తన భర్తతో కలిసి వర్కవుట్లు చేస్తుంటుంది. ఇక ఆరోగ్య పరిరక్షణలో అనసూయ ఎంత జాగ్రత్తగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతీ రోజూ వర్కవుట్లు, డైట్‌ను మెయింటైన్ చేస్తుంటుంది. తాను మాత్రమే కాకుండా తన భర్తతోనూ డైట్‌ను మెయింటైన్ చేయిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఉదయాన్నే ఈ ఇద్దరూ ఎనర్జీ డ్రింక్‌ను తాగుతోన్నట్టు కనిపిస్తోంది.

Advertisement

Anasuya Bharadwaj On Kollywood Entry

Anasuya భర్తతో కలిసి అనసూయ చీర్స్..

ఇద్దరూ కలిసి చీర్స్ చెప్పుకుంటూ ప్రత్యేకమైన ఎనర్జీ ద్రావణాన్ని తాగేస్తున్నారు. మొత్తానికి ఆరోగ్యమే మహా భాగ్యమనే సూత్రాన్ని అనసూయ బాగానే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అనసూయ బాలీవుడ్ ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీగా ఉంది. అందుకే పండుగ స్పెషల్ ఈవెంట్లలకు అనసూయ రావడం లేదు. ఇక మాలీవుడ్‌లోనూ మమ్ముట్టితో ఓ చిత్రం చేస్తోంది. తెలుగులో అయితే అనసూయ చేతిలో భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ పుష్ప చిత్రంతో మరోసారి దుమ్ములేపేందుకు రెడీగా ఉంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి