Anasuya and Sushank love story So many twists
Anasuya : ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై సందడి చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అందాల ముద్దుగుమ్మ తెగ సందడి చేస్తుంది. అయితే అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేస్తుంటుంది. అయితే అనసూయ లవ్ స్టోరీ చాలా ట్విస్ట్‌లతో సాగిందనే విషయం మీకు తెలుసా? అనసూయ వాళ్ల ఫాదర్ పేరు సుదర్శన్ రావు..ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, వారిలో పెద్దది అనసూయనే.
ఆమె చెల్లెళ్ల పేర్లు.. అంబిక, వైష్ణవి కాగా, పెద్దమ్మాయిని ఆర్మీ ఆఫీసర్‌ని చేయాలని సుదర్శన్ రావు అనుకున్నాడు.అయితే ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు ఎన్‌సీసీ క్యాంపులో అనసూయకు సుశాంక్ భరద్వాజ్ పరిచయం కాగా, రిపబ్లిక్ డే పెరేడ్ కోసం ఢిల్లీకి వెళ్లినప్పుడు ఇద్దరి మధ్యా పరిచయం పెరిగి, అది ప్రేమకు దారి తీసింది. మొదట అతనే ప్రపోజ్ చేయగా, ఎలా రెస్పాండ్ అవ్వాలో అనసూయకు తెలీలేదు. మొదట ఈ విషయాన్ని అమ్మకూ, నాయనమ్మకూ చెప్పింది. వారి ద్వారా సుదర్శన్ రావుకు తెలియడంతో కోపంతో ఊగిపోయారు.సుశాంక్ వాళ్లది బీహార్ అని తెలిశాక చాలా భయపడ్డాడు. దీంతో వెంటనే ఆమెకు సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు. అప్పుడు అనసూయ సుశాంక్‌ని తప్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోనని చెప్పింది.
Anasuya and Sushank love story So many twists
గొడవల మధ్యే డిగ్రీ పూర్తి చేసింది. దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఇంట్లో వాళ్లతో పోరాడి, ఎట్టకేలకు తన తండ్రి సుదర్శన్ రావును ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది అనసూయ. అయితే ఏడాది తిరిగేసరికల్లా 2011లో మొదటి అబ్బాయి ‘శౌర్య’ పుట్టగా, 2013లో అనసూయకు ‘జబర్దస్త్’ యాంకర్‌గా ఆఫర్ తలుపు తట్టింది. ఇక ఆ షో హిట్ కావడం, అనసూయకి మంచి పేరు రావడం జరిగింది. ఇక రెండో కొడుకు అయాంచ్.. బీహార్‌లో దీపావళి తర్వాత జరిగే చత్ అనే వేడుక రోజు పుట్టారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో సంతోషంగా సరదాగా తన వైవాహిక జీవితాన్ని గడుపుతూ వస్తుంది అనసూయ.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.