Anasuya : అన‌సూయ‌- సుశాంక్ ల‌వ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్‌లా.. చివ‌రిక పెళ్లి ఎలా అయిందంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : అన‌సూయ‌- సుశాంక్ ల‌వ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్‌లా.. చివ‌రిక పెళ్లి ఎలా అయిందంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :19 November 2022,1:40 pm

Anasuya : ప్ర‌స్తుతం బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై సంద‌డి చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అందాల ముద్దుగుమ్మ తెగ సంద‌డి చేస్తుంది. అయితే అన‌సూయ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అప్పుడ‌ప్పుడు త‌న ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేస్తుంటుంది. అయితే అన‌సూయ‌ లవ్ స్టోరీ చాలా ట్విస్ట్‌ల‌తో సాగింద‌నే విష‌యం మీకు తెలుసా? అనసూయ వాళ్ల ఫాదర్ పేరు సుదర్శన్ రావు..ఆయ‌న‌కు ముగ్గురు ఆడపిల్లలు ఉండ‌గా, వారిలో పెద్దది అనసూయనే.

ఆమె చెల్లెళ్ల పేర్లు.. అంబిక, వైష్ణవి కాగా, పెద్దమ్మాయిని ఆర్మీ ఆఫీసర్‌ని చేయాలని సుద‌ర్శ‌న్ రావు అనుకున్నాడు.అయితే ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు ఎన్‌సీసీ క్యాంపులో అనసూయకు సుశాంక్ భరద్వాజ్ పరిచయం కాగా, రిపబ్లిక్ డే పెరేడ్ కోసం ఢిల్లీకి వెళ్లినప్పుడు ఇద్దరి మధ్యా పరిచయం పెరిగి, అది ప్రేమ‌కు దారి తీసింది. మొదట అతనే ప్రపోజ్ చేయ‌గా, ఎలా రెస్పాండ్ అవ్వాలో అనసూయకు తెలీలేదు. మొదట ఈ విష‌యాన్ని అమ్మకూ, నాయనమ్మకూ చెప్పింది. వారి ద్వారా సుదర్శన్ రావుకు తెలియ‌డంతో కోపంతో ఊగిపోయారు.సుశాంక్ వాళ్లది బీహార్ అని తెలిశాక చాలా భ‌య‌ప‌డ్డాడు. దీంతో వెంట‌నే ఆమెకు సంబంధాలు చూడ‌డం మొద‌లు పెట్టాడు. అప్పుడు అన‌సూయ సుశాంక్‌ని త‌ప్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోన‌ని చెప్పింది.

Anasuya and Sushank love story So many twists

Anasuya and Sushank love story So many twists

Anasuya : బాగానే ఫైట్ చేసింది…!

గొడ‌వ‌ల మ‌ధ్యే డిగ్రీ పూర్తి చేసింది. దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఇంట్లో వాళ్లతో పోరాడి, ఎట్టకేలకు త‌న తండ్రి సుదర్శన్ రావును ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది అన‌సూయ‌. అయితే ఏడాది తిరిగేసరికల్లా 2011లో మొదటి అబ్బాయి ‘శౌర్య’ పుట్టగా, 2013లో అనసూయకు ‘జబర్దస్త్’ యాంకర్‌గా ఆఫర్ త‌లుపు త‌ట్టింది. ఇక ఆ షో హిట్ కావ‌డం, అన‌సూయ‌కి మంచి పేరు రావ‌డం జ‌రిగింది. ఇక రెండో కొడుకు అయాంచ్.. బీహార్‌లో దీపావ‌ళి త‌ర్వాత జ‌రిగే చ‌త్ అనే వేడుక రోజు పుట్టారు. ఇప్పుడు ఇద్ద‌రు పిల్ల‌ల‌తో సంతోషంగా స‌ర‌దాగా త‌న వైవాహిక జీవితాన్ని గడుపుతూ వ‌స్తుంది అన‌సూయ‌.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది