Anasuya : రాజ‌కీయాల‌లోకి న‌న్ను లాగొద్దంటూ రిక్వెస్ట్ చేసిన అన‌సూయ‌

Authored By Sam C | The Telugu News | Published on: August 20, 2022, 8:00 pm

Anasuya : బుల్లితెర‌తో పాటు వెండితెరపై త‌న అంద‌చందాల‌తో అద‌ర‌గొడుతున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో ఎప్పుడూ తొందరపడదు. జబర్దస్త్ కామెడీ షోకి గుడ్ బై చెప్పిన ఆమె మరిన్ని షోలకు యాంకరింగ్ చేస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ ఒక ట్వీట్ చేయగా అది ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపింది.

Anasuya : అన‌సూయ రిక్వెస్ట్..

ఇటీవల మంత్రి కేటీఆర్ గుజరాత్ బిల్కిన్ బానో సామూహిక అత్యాచారం కేసులో జైలుకు వెళ్లిన దోషులు విడుదలయ్యాక వారికి ఒక సంస్థ సన్మానం చేయడంతో వారికి కౌంటర్ ఇస్తూ ఒక ట్వీట్ చేశారు. దాన్ని అనసూయ రీట్వీట్ చేయడంతో పలువురు నెటిజెన్లు అనసూయను టార్గెట్ చేశారు. మరి అప్పట్లో హైదరాబాదులో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన సమయంలో మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. దీనిపై అన‌సూయ వ‌రుస‌గా ట్వీట్స్ చేసింది. నేను ఎలాంటి ట్వీట్ చేసినా అది నా సొంత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే తప్ప ఎవరినీ, దేనినీ ప్రమోట్ చేయడానికి కాదని ఆమె రిప్లై ఇచ్చింది.

Anasuya Bharadwaj about Rumours On Her Politics

Anasuya Bharadwaj about Rumours On Her Politics

మీరు అలా ఉన్న‌ప్పుడు రాజకీయ విషయాల మీద ట్వీట్స్ చేయడం మానుకోండి మీరు ముందుగా ఆర్టిస్ట్ అని ఒప్పుకోండని సదరు నైటిజన్ ట్వీట్ చేశారు. దానికి ఘాటుగా స్పందించిన అనసూయ నేను ముందు మనిషిని తర్వాత స్త్రీని ఆ తర్వాతే మిగతావన్నీ అంటూ కౌంటర్ ఇచ్చారు.ఇండస్ట్రీలో ఆడవాళ్లంటే ముఖ్యంగా హీరోయిన్స్​కు ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. హీరోయిన్​అంటే కెమెరా ముందు కాపాడండి అంటూ ఉండాలి. లేదా సిగ్గుపడుతూ నవ్వాలి. అదే మా పని. అస్సలు మాట్లాడకూడదు. పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్​ఉంది కదా. సేమ్​అలాగే ఇక్కడ పరిస్థితి ఉంటుంది అని అన్నారు. అన‌సూయ కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. తాను ఏ ట్వీట్ చేసినా అది తన సొంత ఆసక్తి మాత్రమేనని చెప్పింది. తాను ఎవరినీ ప్రమోట్ చేసేందుకో.. డబ్బుల కోసమో ట్వీట్స్ చేయడం లేదని తెలిపింది. తన ట్వీట్స్‌ను రాజకీయం చేయవద్దంటూ నెటిజన్లను కోరింది.

Sam C

No bio available for this author.

  1. "Superstar Krishna Remuneration : సూపర్ స్టార్ కృష్ణ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? విజయనిర్మల చెప్పిన ఆసక్తికర విషయాలు!"

  2. "US Midterm Elections 2026 : అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే మనకు లాభమా? నష్టమా?"

  3. "Chandrababu : డిసెంబరులో ఏపీ కేబినెట్‌లో మార్పులు? పల్నాడు, రాయలసీమ కు కొత్త మంత్రులు!"

  4. "Home Loan Tips : బ్యాంకులు చెప్పని సీక్రెట్‌.. 20 ఏళ్ల హోమ్ లోన్‌ను త్వరగా తీర్చాలా? ఈ 5 స్మార్ట్ EMI పద్ధతులు పాటించండి..!"

  5. "AP Municipal Election Results : ఏపీ మున్సిపల్ ఫలితాలకు అంతా రెడీ.. ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు..!"

  6. "Rising Stars Asia Cup 2026 : నవంబర్ 22న మ‌రోసారి భారత్-పాక్ బిగ్ ఫైట్.. తిలక్ వర్మకు కెప్టెన్సీ!"

  7. "Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్‌లోకి రోహిత్ రీ ఎంట్రీ? వైరల్‌గా మారిన ఫోటోతో కొత్త ట్విస్ట్ !"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp