Home » Entertainment » Anasuya Bharadwaj And Anchor Suma Reel Video Viral
Entertainment

Anasuya – Suma : యాంకరమ్మల చిందులు.. కలిసి దుమ్ములేపిన అనసూయ, సుమ

Authored By
aruna
The Telugu News | Published on: September 26, 2022, 6:30 pm
Advertisement

Anasuya – Suma : బుల్లితెరపై యాంకర్లుగా సుమ, అనసూయలకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సుమకు తిరుగులేని క్రేజ్ ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి యాంకర్‌గా టాప్ ప్లేస్‌లో ఉంటోంది. యాంకరింగ్‌కు తెలుగు గ్లామర్‌ను నేర్పించింది సుమ. అయితే యాంకరింగ్‌కు గ్లామర్‌ను అద్దింది మాత్రం అనసూయనే. జబర్దస్త్ షోకు ప్రారంభంలో అనసూయ యాంకర్‌గా వ్యవహరించింది. ఓ 25 ఎపిసోడ్స్‌‌కు యాంకర్‌గా వ్యవహరించింది. ఆ తరువాత పర్సనల్ రీజన్స్‌తో యాంకరింగ్ ఆపేసింది అనసూయ. అయితే సుమ మాత్రం ఎప్పుడూ బుల్లితెరకు దూరంగా లేదు. తన ఫోకస్ అంతా కూడా బుల్లితెరపైనే పెడుతుంటుంది.

Advertisement

మధ్యలో సినిమా ఈవెంట్లు, సినిమాల్లో నటించడం వంటివి చేసినా కూడా ఫోకస్ మాత్రం బుల్లితెరపై నుంచి పక్కకు జరగనివ్వలేదు. కానీ అనసూయ మాత్రం ఎప్పుడూ బుల్లితెర, వెండితెర అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తుంటుంది. మధ్య మధ్యలో బుల్లితెరకు గ్యాప్ ఇస్తుంటుంది. ఇప్పుడు అయితే జబర్దస్త్ షో నుంచి అనసూయ బయటకు వచ్చేసింది. కానీ బుల్లితెరను మాత్రం వదల్లేదు. ఇన్ని రోజులు స్టార్ మా సింగింగ్ షోలో యాంకరింగ్ చేసింది. ఇక ఇప్పుడు అది కూడా ముగిసింది. మళ్లీ ఈటీవీ షోలకు వస్తుందో లేదో చూడాలి. బుల్లితెరపై అనసూయ కనిపించకపోయినా కూడా..

Anasuya Bharadwaj and Anchor Suma Reel Video Viral

Advertisement

సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంటుంది. నెట్టింట్లో అనసూయ వేసే ట్వీట్లు ఎంతగా కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఇక అనసూయ వీడియోలు, ఫోటోలు సైతం వైరల్ అవుతుంటాయి. అందులోనూ సుమ చేసే ఫన్నీ రీల్ వీడియోలకు అందరూ ఫిదా అవుతుంటారు. అలాంటి సుమ, అనసూయ కలిసి చిందులు వేస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ ఇద్దరూ కలిసి తాజాగా ఓ రీల్ వీడియోను షేర్ చేశారు. ఇందులో అనసూయ, సుమ కలిసి వేసిన చిందులు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ రీల్ వీడియో మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి