Anasuya Bharadwaj : ఇంట్లోనూ అనసూయ రచ్చ.. బుల్లి నిక్కర్‌లో హల్చల్
Anasuya Bharadwaj : బుల్లితెర, వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ.. Anasuya Bharadwaj సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అనసూయ వస్త్రాధారణ మీద వచ్చినన్ని ట్రోలింగ్ మరెవ్వరి మీదా వచ్చి ఉండవు. ఆమె ధరించే బుల్లి నిక్కర్లు, చేసే అందాల ప్రదర్శన మీద ఎప్పుడూ నెగెటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. ఇక ఆమె చేసే అందాల విందుకు పడిపోనీ వారెవ్వరూ ఉండరు. ఆ మధ్య ఓ సారి లైవ్‌లోకి వచ్చినప్పుడు ఆమె నల్ల చీర ధరించడం,లైవ్‌లో ఆమె నాభి అందాలు కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు.

Anasuya Bharadwaj Wear Shorts In Home
అలా అనసూయ ప్రతీ విషయంలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. తెరపై ఆమె ఎలా కనిపిస్తుందో ఇంట్లోనూ అలానే పొట్టి బట్టలనే ధరిస్తుంటారు. ఆ మధ్య ఓ సారి కిచెన్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో బయటకు రావడం, తన పిల్లలు, భర్తతో ఉన్నప్పుడు ఓ ఫోటో బయటకు రావడంతో ఎంతటి ట్రోలింగ్‌కు గురైందో అందరికీ తెలిసిందే. తన కొడుకు కూడా అదే ప్రశ్న అడుగుతాడని, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటావని అడిగాడంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇంట్లోనూ అనసూయ Anasuya Bharadwaj రచ్చ.. బుల్లి నిక్కర్‌లో హల్చల్
తన కంఫర్ట్ తాను చూసుకుంటాను అని, అలా ఇంకొకరి అభిప్రాయాల మీద మనం కామెంట్ చేయకూడదని తన కొడుక్కు చెప్పానని అనసూయ తెలిపింది. అలా అనసూయ వస్త్రాధారణ ఎప్పుడూ కూడా వివాదాం అవుతూనే ఉంటుంది. తాజాగా ఆమె ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారు. అనసూయ ఇంట్లో పావురాలు, చిలకలు, కుక్క పిల్లలు అన్నీ ఉంటాయని తెలిసింది. వాటితో ఆడుకుంటున్న వీడియోను షేర్ చేసింది. ఇందులో తన కొడుకులు కూడా కనిపిస్తున్నారు. ఇక ఇందులో అనసూయ మాత్రం ఓ బుల్లి నిక్కర్‌ను ధరించినట్టు కనిపిస్తోంది. దీంతో అనసూయ తొడ అందాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.