Anasuya : సమంతలా యాంకర్ అనసూయ కూడా ఆ సమస్యతో బాధపడుతోందా? అందుకే జబర్దస్త్ మానేసిందా? వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 16 January 2023, 12:00 pm

Anasuya : యాంకర్లు కూడా అందంగా ఉంటారు. మెస్మరైజ్ చేస్తారు.. కుర్రాళ్ల మతులు పోగొడతారు అని అనసూయ వచ్చాకనే అర్థం అయింది. ఎప్పుడైతే తను జబర్దస్త్ లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి తన లైఫే మారిపోయింది. తన కెరీర్ ఒక్కసారిగా పైకి ఎగబాకింది. ఒక యాంకర్ స్థానం నుంచి తను ఏకంగా హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. తనను ఎవ్వరూ ఆపలేకపోయారు. ఒక్కసారిగా జనాల్లో తనకు క్రేజ్ వచ్చేసింది. అనసూయ అంటే చాలు పిచ్చెక్కిపోయేలా చేసింది. తన అందచందాలతో కవ్వించి కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది యాంకర్ అనసూయ.

మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ యాంకర్ అనసూయ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఓవైపు సినిమాలు, మరోవైపు షోలు, ఇంకోవైపు సోషల్ మీడియా ఎక్కడ చూసినా అనసూయ గురించే చర్చ. మీడియా అయితే అనసూయ గురించి మాట్లాడని రోజు ఉండదు. అయితే.. తాజాగా అనసూయ నెటిజన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ఓ వీడియోను పోస్ట్ చేయడంతో జనాలంతా అసలు అనసూయ ఏం పెట్టిందంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

anasuya bharadwaj is also suffering with that disease

anasuya bharadwaj is also suffering with that disease

Anasuya : నేను ఓ డిజార్డర్ తో బాధపడుతున్నా అంటూ వీడియోలో చెప్పుకొచ్చిన అనసూయ

నేను ఒక డిజార్డర్ తో బాధపడుతున్నా. అది ఏంటంటే.. నా గురించి నెగెటివ్ గా మాట్లాడే వారిని నేను అస్సలు లెక్క చేయను. వాళ్ల గురించి పట్టించుకోకపోవడమే నా డిజార్డర్ అంటూ సింపుల్ గా తనపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్లపై ఉక్కుపాదం మోపింది అనసూయ. సాధారణంగా అనసూయను ట్రోల్ చేసేవాళ్లకు ఆ వీడియోను అంకితం చేసినట్టుగా ఉంది. కాకపోతే.. ఆ వీడియోలో ఉన్నది తన వాయిస్ కాదు. డబ్ ష్మాష్ చేసి ఆ వ్యాఖ్యలను చెప్పింది అనసూయ. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి