Home » Entertainment » Anasuya Bharadwaj Latest Crying Video
Entertainment

Anasuya : గుండెలవిసేలా ఏడుస్తున్న అనసూయ.. ఎందుకంటే?.. వీడియో వైరల్

Authored By
aruna
The Telugu News | Updated on: August 19, 2023 3:47 pm
Advertisement

Anasuya : అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో మాత్రం అందరినీ కదిలిస్తోంది. అందులో అనసూయ వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించింది. సుధీర్ఘమైన పోస్ట్ కూడా వేసింది. అందులో ఏముందో ఓ సారి చూద్దాం. అందరికీ హలో.. అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను.. ఈ పోస్ట్ చూసిన తరువాత అందరూ గందరగోళానికి గురవుతారని నాకు తెలుసు.. సోషల్ మీడియాలో అనేది మొదట్లో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి వచ్చింది..

Advertisement

ప్రపంచం గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడ్డాయి.. సమాచారాన్ని తెలుసుకోవడానికి పనికి వచ్చాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్కృతి సంప్రదాయల గురించి తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఉపయోగపడింది.. కానీ ఇప్పుడు అలానే ఉందా?.. ఇవన్నీ కాదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో నేను పోస్ట్ వేసిన ఫోటోలు, ఇచ్చిన పోజులు ఇవన్నీ కూడా నా పర్సనల్ సంగతులు.. నేను బాగా లేని రోజులు, కష్టాన్ని అనుభవించిన రోజుల్ని సోషల్ మీడియాలో పంచుకోలేదు..

Advertisement

నేను నమ్మే వాటిని ధైర్యంగా చెబుతాను.. నేను స్ట్రాంగ్‌గా ఉండేందుకు చూస్తుంటాను.. నేను నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను.. ట్రోలింగ్ వచ్చినా ఒక రోజు రెండ్రోజుల తరువాత సెట్ అవుతాను.. కానీ చెప్పడం మాత్రం ఆపను.. మీ అందరినీ నేను వేడుకునేది ఒక్కటే.. అందరి పట్ల జాలి, దయతో ఉండండి.. పక్కవారికి బాగా లేనప్పుడు అండగా ఉండండి.. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను.. ఇది ఐదు రోజుల క్రితం జరిగింది.. నేను నా మెమోరీగా ఉంటుందని నా ఏడ్పుని రికార్డ్ చేసుకున్నాను.. అని చెప్పుకొచ్చింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి