Anasuya Bharadwaj Reveals Facts on Leaving Jabardasth
Anasuya : అనసూయ జబర్దస్త్ వీడటంపై వచ్చినన్నీ కథనాలు ఇంకెవ్వరి మీద వచ్చి ఉండవు. అసలే ఒకసారి బయటకు వెళ్లి.. మళ్లీ వచ్చింది. ఇక ఇప్పుడు శాశ్వతంగా బయటకు వెళ్లినట్టుంది. అయితే అలా మల్లెమాలకు దూరంగా, జబర్దస్త్ షోను వదలడంపై సరైన కారణాలు మాత్రం ఎక్కడా చెప్పలేదు. కానీ తాజాగా ఈ విషయాలపై అనసూయ స్పందించింది. జబర్దస్త్ నుంచి బయటకు రావాలనే థర్డ్ ప్రాసెస్ రెండేళ్ల నుంచి జరుగుతూ ఉందని చెప్పుకొచ్చింది. మల్లెమాల ప్రొడక్షన్స్ హౌస్ నాకు మంచి అవకాశాలను ఇచ్చింది.. అక్కడ మంచి మంచి వ్యక్తులు ఉన్నారు అంటూ గొప్పగా చెప్పేసింది. అదే సందర్బంలో చాలా వివాదాలు కూడా వచ్చాయనంది. నాకెందుకో అనిపిస్తుంది.. జబర్దస్త్‌లో ఉన్న వాళ్లకి దిష్టి తగిలిందేమో అని.. అందుకే ఇలా అయ్యింది.. అంతా కలిసి ఫ్యామిలీలా ఉండేదంటూ ఎమోషనల్ అయింది. మరోవైపు జబర్దస్త్ చేస్తూ ఉన్నాను..
అది తన లైట్ హార్టెడ్ షో.. కొన్ని సందర్భాల్లో లైన్ క్రాస్ చేస్తుంటారని చెప్పుకొచ్చింది. నిజానికి తాను జబర్దస్త్‌లో చేసేది..సినిమాల్లో చేసేది తాను కాదని అంది. తాను కేవలం అక్కడ పనిచేస్తున్నానంతే అంటూ తెలిపింది. తన గురించి తాను చెప్పడం కోసమే బ్రేక్ తీసుకున్నని అంటోంది. తనకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయని, షూటింగ్ కోసం అడ్జెస్ట్‌మెంట్ అడిగినప్పుడు తనకే గిల్టీగా అనిపిస్తుందని చెప్పింది. అంతమంది చేస్తున్నారు.. నా కోసం షెడ్యుల్ మార్చడం కరెక్ట్ కాదని నాకే అనిపించిందంటూ ఎమోషనల్ అయింది. తొమ్మిదేళ్లు జబర్దస్త్ యాంకర్‌గా ఉన్నా.. నాకు ఆ షో బోర్ కొట్టలేదు. నేను ఎవర్నీ బ్లేమ్ చేయదల్చుకోలేదని చెప్పుకొచ్చింది. నాకు నచ్చని సందర్భాలు చాలా ఉన్నాయి కానీ.. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఇవన్నీ తప్పవని తెలిపింది. ఆ ఊబిలో ఇరుక్కోవాలని నాకు అనిపించలేదు. నాకు ఎందుకు భయం వేసింది.. ఏదైనా పంచ్ వేసినప్పుడు నాకు నచ్చక ఎక్స్ ప్రెషన్స్& రియాక్షన్ ఇచ్చినా..
Anasuya Bharadwaj Reveals Facts on Leaving Jabardasth
అది పీపుల్‌కి చేరేది కాదు. కానీ ఆడియన్స్‌కి మాత్రం కనిపించేదే నిజం. రంగుల ప్రపంచంలో నేను అది కాదు అని చెప్పాలనుకున్నా అది ఆడియన్స్‌కి చేరదంటూ చెప్పుకొచ్చింది. బాడీ షేమింగ్.. వెకిలి చేష్టలు నాకు నచ్చవు. అది నేను కాదు. వాటిపై నేను రియాక్షన్ ఇచ్చే ఉంటాను కానీ అది వేయరు. చాలా స్ట్రగుల్ పడ్డాను. కొంతమంది నన్ను చాలా మంచిదాన్ని అని అంటుంటారు. ఇంకొంతమంది నాకు పొగరని అంటారు.. అదీ నేనే.. ఇదీ నేనే.. ఆ విషయంలో నేను సిగ్గుపడటం లేదు. నాగబాబు గారు వెళ్లిపోయారు.. రోజా గారు వెళ్లిపోయారు.. ఇంకా చాలామంది వెళ్లిపోయారు కదా.. అని నేను జబర్దస్త్‌ని వదిలేశాననడం నిజం కాదు. నాగబాబుగారు..
రోజా గారు.. నేను మీమంతా మొదటి నుంచి ఉన్నాం.. అప్పటికి సుడిగాలి సుధీర్ వాళ్లు కూడా లేరు. వాళ్లు వెళ్లిపోయారు కదా అనే వెళ్లిపోవడానికి నేనేం గొర్రెల మంద టైప్ కాదు. ఓ గొర్రెల మంద నన్ను ఎటాక్ చేయడం జరిగింది చాలా రోజుల క్రితమంటూ ట్రోలర్లపై కౌంటర్లు వేసింది. నాకు టీఆర్పీ గురించి పెద్దగా లెక్కలు తెలియవు. నేను స్టార్టింగ్‌లో చేసినప్పుడు హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చిందట. నాకిచ్చే జీతానికి నేను ఎంత చేయాలో అంత చేస్తానని తెలిపింది. నాకు టీఆర్పీతో సంబంధం లేదు. నేను వాటిని పట్టించుకోను. అయితే ఇప్పటివరకూ నా వల్ల తక్కువ వచ్చిందని.. నేను తప్పు చేశాననే మాట నాకు ఇప్పటి వరకూ వినిపించలేదు అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చింది అనసూయ.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.