Home » Entertainment » Naga Chaitanya Shares Sad Moment In Her Life
Entertainment

Naga Chaitanya : ఆ బాధ‌తోనే థియేట‌ర్‌కి వెళ్ల‌డం మానేశాన‌న్న నాగ చైత‌న్య‌

Authored By
Sam C
The Telugu News | Published on: August 13, 2022, 7:40 pm
Advertisement

Naga Chaitanya : అక్కినేని హీరో నాగ చైత‌న్య ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న న‌టించిన థ్యాంక్యూ, లాల్ సింగ్ చ‌ద్దా చిత్రాలు ఇటీవ‌లి కాలంలో విడుద‌ల కాగా, ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నాగ చైత‌న్య ఆసక్తిక‌ర స‌మాధానాలు ఇచ్చారు. దీంతో చైతూ పేరు సోష‌ల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది. నాగ చైతన్య లాల్ సింగ్ చ‌ద్దా చిత్రంలో కీలక పాత్రలో నటించారు. చైతు నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో నాగ చైతన్య తన కెరీర్ లో జరిగిన కీలక అంశాన్ని బయట పెట్టాడు. ఆ సంఘటన నాగ చైతన్య మనసుని ఎంతగానో బాధించింది అట.

Advertisement

Naga Chaitanya : నిరాశ చెందిన చైతూ..

‘నా ఫస్ట్‌ మూవీ జోష్‌ విడుదలైనప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూడాలన్న ఉద్దేశంతో ఎంతో ఉత్సాహాంగా ఫస్ట్‌డే ఓ థియేటర్‌కి వెళ్లా. సినిమా మొదలైనప్పుడు బానే ఉంది కానీ ఇంటర్వెల్‌కి వచ్చేసరికి చాలామంది ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్ల నుంచి బయటికి వెళ్లిపోవడం చూశా. అది నా హృదయాన్ని గట్టిగా తాకింది. అప్పుడు చాలా బాధనిపించింది. అప్పటి నుంచి నేనెప్పుడూ థియేటర్‌కు వెళ్లలేదు. ఆరోజు జరిగిన సంఘటన నా మైండ్‌లోంచి ఇంకా పోలేదు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి సినిమాను ఎంజాయ్‌ చేయాలనుకుంటాన్నాఅని చైతూ చెప్పుకొచ్చాడు.

Naga Chaitanya Shares Sad Moment In Her Life

Advertisement

లాల్ సింగ్ చడ్డా విషయానికి వస్తే చైతు ఇందులో బాలరాజు పాత్రలో నటించాడు. ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ చిత్రానికి ఇది రీమేక్. ఇండియన్ ఆడియన్స్ ని ఈ చిత్రం ఏమాత్రం మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ నంబర్స్ కూడా దారుణంగా నమోదవుతున్నాయి. త్వరలో నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నాడు. అలాగే పరశురామ్ తో కూడా ఓ చిత్రం చేయాల్సి ఉంది. ఇంకో వైపు వెబ్ సిరీస్‌తో కూడా చైతూ సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. వ‌రుస ప్రాజెక్ట్‌లుచైతూ చేతిలో ఉన్నా కూడా అవి ఆయ‌న‌కు మంచి విజ‌యం అందించ‌లేక‌పోతున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి