Anasuya : సమంతను ఫాలో అవుతోన్న అనసూయ.. అందుకే అలా చేస్తోందా?

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 9, 2021, 2:50 pm

Anasuya  : సమంత సోషల్ మీడియాలో చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. విడాకుల విషయం కాస్త కాంట్రవర్సీ అవుతుండటంతో మధ్యలో ఓ రెండు రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్టుంది. కానీ మళ్లీ సమంత యాక్టివ్ అయిపోయింది. తన మీద వచ్చిన రూమర్లను ఖండించింది. మీడియా, సోషల్ మీడియాను తన మీద ఆరోపణలు చేస్తూ ఎలా వేధిస్తోందో వివరించింది. తన ఆవేదనను బయటపెట్టేసింది.

Anasuya Bharadwaj Shares Weekly Activities

Anasuya Bharadwaj Shares Weekly Activities

అయితే సమంత ఇంతకు ముందు ఓ పద్దతిని ఫాలో అయ్యేది. గత వారంలో ఆమె ఏమేం చేసిందో తెలిపేట్టుగా అన్నింటిని ఫోటోలో రూపంలోతెలిపిందే. గడిచిన వారంలో తాను చేసిన యాక్టివిటీస్ ఏంటో అనేట్టుగా అందరికీ తెలిసేలా ఫోటోలు షేర్ చేసేది. అలా వారం మొత్తం సమంత చేసిన పనులు అందరికీ తెలిసేది. అలా ఇప్పుడు అనసూయ కూడా సమంతను ఫాలో అవుతోన్నట్టు కనిపిస్తోంది.

Anasuya  : వారంలో అనసూయ చేసిన పనులివే..

Anasuya Bharadwaj And Abhi Fuuny Skit

Anasuya Bharadwaj And Abhi Fuuny Skit

సమంత చేసినట్టుగానే అనసూయ కూడా ఓ పోస్ట్ చేసింది. వారం మొత్తం ఎలా ఎంజాయ్ చేసింది? ఎలా గడిపింది?అందులో తన భర్త బర్త్ డేను ఎలా సెలెబ్రేట్ చేసిందో చూపించింది. మొత్తానికి అనసూయ వారం మొత్తం ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.అయితే అనసూయ మాత్రం వర్కవుట్ల మీద ఎక్కువగా ధ్యాస పెట్టినట్టు కనిపిస్తోంది. వర్కవుట్లతోనే ఎక్కువగా బిజీ ఉన్నట్టు తెలుస్తోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp