Anasuya : జబర్దస్త్ యాంకర్ స్టైలే వేరు.. అనసూయ వాట్సప్ డీపీ ఇదే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : జబర్దస్త్ యాంకర్ స్టైలే వేరు.. అనసూయ వాట్సప్ డీపీ ఇదే

 Authored By bkalyan | The Telugu News | Updated on :10 April 2021,12:00 pm

Anasuya : సెలెబ్రిటీల సీక్రెట్స్ తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది.. వారు ఏ ఫోన్ వాడుతుంటారు.. అందులో ఉన్న ఫోటోలు ఏంటి.. వాట్సప్ డీపీ ఏంటి.. ఇలా రకరకాల ఆసక్తులుంటాయి. ఈ మధ్య సెలెబ్రిటీల వాట్సప్ డీపీలపై అందరూ దృష్టి సారించారు. సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ అవ్వడంతో తమ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. నేరుగా వారితోనే చిట్ చాట్ చేస్తున్నారు. అభిమానులు సంధించే ప్రశ్నలకు సెలెబ్రిటీలు సమాధానాలు ఇస్తున్నారు.

తాజాగా జబర్దస్త్ యాంకర్ అనసూయ తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో నెటిజన్లు వింత వింత ప్రశ్నలన్నీ అడిగారు. అయితే ఎవ్వరూ కూడా హద్దులు దాటి ప్రశ్నలు అడగలేదు. అనసూయ కూడా అన్నింటికి ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. అయితే ఇందులో ఓ నెటిజన్ మాత్రం వాట్సప్ డీపీ గురించి ప్రశ్నించాడు. దీంతో ఆమె తన వాట్సప్ డీపీ గురించి చెప్పింది. మామూలుగా అయితే అందరూ కూడా ఫోటోలను డీపీలుగా పెట్టుకుంటారు.

anasuya bharadwaj whatsapp dp

anasuya bharadwaj whatsapp dp

Anasuya : జబర్దస్త్ యాంకర్ స్టైలే వేరు.. అనసూయ వాట్సప్ డీపీ ఇదే

కానీ అనసూయ మాత్రం కొటేషన్స్‌ను పెట్టుకుంది. అందులోనూ ఓ జీవిత సూత్రం దాగి ఉంది. a lack of boundaries invites a lack of respect (మనకంటూ కొన్ని హద్దులు లేకపోతే.. మనకు గౌరవం లభించదు) అనే అర్థం వచ్చేట్టుగా పెట్టుకుంది. అంటే అనసూయ ఆ ఫిలాసఫీని బాగానే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే అనసూయ ఎక్కువగా బయట కనిపించదు.. పార్టీలకు ఎక్కువగా వెళ్లదు. తన హద్దుల్లో తాను ఉంటాను అని రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ చెప్పుకొచ్చింది.

anasuya bharadwaj whatsapp dp

anasuya bharadwaj whatsapp dp

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది