Anasuya : ఎవరితో కలిసి యోగా చేస్తోందో తెలుసా?.. అనసూయ మామూల్ది కాదు
Anasuya అనసూయ తన ఫిట్ నెస్, గ్లామర్ మీద ఎంతగా శ్రద్దపెడుతుందో అందరికీ తెలిసిందే. ఇక చర్మ సౌందర్య, శిరోజాల సంరక్షణకు అనసూయ భారీగానే ఖర్చు పెడుతూ ఉంటుంది. జీరో సైజ్ మెయింటైన్ చేసేందుకు అనసూయ వర్కవుట్లతో కుస్తీ పడుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అనసూయ రచ్చ చేస్తుంటుంది. ఆ ఫోటోలపై అనసూయకు నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి. వాటితో పాటు జరిగే ట్రోలింగ్‌పై అనసూయ అంత ఎత్తుకు లేస్తుంది.

Anasuya Bharadwaj Yoga Session
నెగెటివ్ కామెంట్లు, ట్రోలింగ్‌లను అనసూయ అస్సలు ఉపేక్షించదు. నెటిజన్లు ఎలా రెచ్చిపోతారో.. అనసూయ అంతకు పదింతలు రెచ్చిపోతుంటుంది. మీడియాపై అనసూయ పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్నటికి మొన్న కేసులు పెడతాను..కోర్టుకు వెళ్తాను అంటూ బీరాలకు పోయింది. తన ప్రమేయం లేకుండా తన గురించితప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్ చానెల్‌లపై అనసూయ మండిపడింది.
Anasuya అనసూయ యోగాసనాలు

Anasuya Bharadwaj Yoga Session
మా ఎన్నికల్లో ఓటమిపై అనసూయ బాగానే హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. అయితే వాటి నుంచి త్వరగానే బయటకు వచ్చి తన పనిలో తాను తలమునకలై ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఉదయాన్నే లేచిన అనసూయ తన రెగ్యులర్ యాక్టివిటీస్‌లో బిజీగా మారింది. అయితే అనసూయ యోగా చేస్తోన్న సమయంలో తన పార్ట్నర్ అక్కడే ఉన్నాడట. తనకు ఎంతో ఇష్టమైన పెట్.. తన యోగా పార్ట్నర్ అని చెప్పుకొచ్చింది. అనసూయతో పాటు ఆ పెట్ కూడా యోగా చేస్తోంది.