Anasuya : వెరైటీ చీరకట్టులో క్యూట్ సాంగ్‌కి అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ రచ్చ చేసిన అనసూయ
Anasuya: అనసూయ భరద్వాజ్.. ఈ ముద్దుగుమ్మ ఇటీవలి కాలంలో సినిమాలు, టీవీ షోలతోనే కాకుండా సోషల్ మీడియాతోను తెగ రచ్చ చేస్తుంటుంది. ఉమెన్స్ డే రోజు ఈ అమ్మడు చేసిన ట్వీట్ ఎంత పెద్ద వివాదాస్పదం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనసూయపై తెగ ట్రోలింగ్ జరిగిన కూడా ఈ ముద్దుగుమ్మ తనదైన శైలిలో ముందుకు సాగుతుంది. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనసూయ ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ బ్లూ శారీలో నీలి ఆకాశాన్ని పోలినట్టుంది.హాఫ్ షోల్డర్ బ్లౌజ్, నెట్ శారీలో మతిపోగొడుతోంది. అనసూయ హాట్ లుక్స్ కు కుర్రాళ్ల గుండె జారి గల్లంతవుతోంది. ఈ అమ్మడు హోయలు పోతున్న విధానం చూసి మైమరచిపోతున్నారు. ప్రస్తుతం అనసూయ స్టన్నింగ్ వీడియో మెస్మరైజ్ చేస్తుంది. ఈ అమ్మడి క్యూట్ వీడియోకి లైకులు , కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అనసూయ నటించిన క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది. ఓ వైపు యాంకరింగ్‌తో బిజీగా ఉంటూనే అనసూయ వరుస సినిమాలతో అదరగొడుతోంది.ఇక అనసూయ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే..

anasuya cute video viral
Anasuya : అనసూయ అందాల రచ్చ..
కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి ఆచార్యలో కీలకపాత్రలో ఆ జబర్దస్త్ భామ కీలకపాత్రలో కనిపించనుందని సమాచారం. ఈ సినిమాలతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో కీలకపాత్రలో కూడా అనసూయ కనిపించనుంది. కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలో కూడా అనసూయ ఓ క్రేజీ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ.
View this post on Instagram