Anasuya : నా మొహం ఇలా ఉందేంటి?.. ఆశ్చర్యపోయిన యాంకర్ అనసూయ

Authored By Cinema Desk | The Telugu News | Published on: November 6, 2021, 7:10 pm

Anasuya : యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో తెగ అల్లరి చేస్తుంటుంది. తన ఇంటి విశేషాలు చెబుతూ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంట్లో ఉన్న పక్షులు, రకరకాల జంతువులు,పెట్స్‌ను చూపిస్తూ ఉంటుంది. అనసూయ జంతు ప్రేమికురాలన్న సంగతి తెలిసిందే. అయితే అనసూయకు సోషల్ మీడియాలో ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా ఉంటుంది. అయితే ఈ దీపావళిని మాత్రం అనసూయ తన ఇంటి సభ్యులతో ఎంతో ఘనంగా చేసుకుంది.

anasuya diwali 2021 with family

anasuya diwali 2021 with family

ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఫోటోలు దిగడం, తన భర్త, పిల్లలతో కలిసి సందడిగా గడిపిన క్షణాలు, వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అనసూయ ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించింది. చీరకట్టులో, ఆ నగలు పెట్టుకుని మహాలక్ష్మీలా అనిపించింది. అయితే నిన్న రాత్రి అనసూయ ఫ్యామిలీతో బయటకు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో కారులో ఆమె భర్త సుశాంక్ డ్రైవింగ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

Anasuya : ఫ్యామిలీతో అనసూయ హల్చల్..

anasuya diwali 2021 with family

anasuya diwali 2021 with family

ఇక కారులో హుషారైన పాటలు పెట్టుకుని అనసూయ ఎంజాయ్ చేస్తోంది. వాటిని హమ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఎంజాయ్ చేసింది. వెనకాల ఇద్దరు పిల్లలున్నారు. అందులో చిన్న వాడు నిద్రపోతూ ఉన్నట్టున్నాడు. ఏంట్రా నిద్ర పోతున్నావా? అని అనేసరికి వాడు లేచి కూర్చున్నాడు. ఇక తన మొహాన్ని చూసుకుంటూ.. ఏంట్రా నా మొహం ఇలా అయిపోయింది. దీపావళిలా వెలిగిపోతుందని అనుకుంటే ఇలా అయిపోయిందని అనసూయ చెప్పుకొచ్చింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp