Anasuya.. షాకింగ్.. అనసూయ ఇంట్లో విషాదం..!
Anasuya.. తెలుగు బుల్లితెర మీద తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది యాంకర్ అనసూయ. మొదట ఓ న్యూస్ చానళ్లో ప్రజెంటర్ గా పనిచేసిన అనసూయ నెమ్మదిగా యాంకర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టింది. ఇద్దరు పిల్లలకు తల్లయినా కానీ అనసూయ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అందర్నీ అలరిస్తోంది.
అలా యాంకర్ అనసూయకు అనేక మంది అభిమానులు ఉన్నారు. అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ మీద కామెంట్లు చేసే వారు కూడా అనేక మంది ఉన్నారు. కానీ ఇప్పుడు యాంకర్ అనసూయ తీవ్ర దు:ఖంలో మునగిపోయింది. కారణం ఆమె తండ్రి సుదర్శన్ రావు ఈ రోజు అనారోగ్యంతో మరణించారు.

anasuya Father Is no more
హైదరాబాద్ లోని తార్నాకలో ఉంటున్న సుదర్శన్ రావు ఈ రోజు తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఆయనను ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలిద్దామని భావించారు. కానీ అంతలోనే సుదర్శన్ రావు కన్నుమూశారు. సుదర్శన్ రావు కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా అనేక బాధ్యతలు నిర్వహించారు.