Anasuya Bharadwaj : దుస్తుల వ్యాఖ్యల నుంచి చీర ఛాలెంజ్ వరకూ.. అనసూయ-శివాజీ వివాదం కొత్త మలుపు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya Bharadwaj : దుస్తుల వ్యాఖ్యల నుంచి చీర ఛాలెంజ్ వరకూ.. అనసూయ-శివాజీ వివాదం కొత్త మలుపు..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 January 2026,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Anasuya Bharadwaj : దుస్తుల వ్యాఖ్యల నుంచి చీర ఛాలెంజ్ వరకూ.. అనసూయ-శివాజీ వివాదం కొత్త మలుపు..!

Anasuya Bharadwaj : దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారగా, వాటిపై నటి అనసూయ భరద్వాజ్ గట్టిగా స్పందించడం చర్చకు కేంద్రబిందువైంది. అయితే ఈ వివాదం అక్కడితో ఆగకుండా, రాజకీయ రంగు పులుముకుని మరో దశకు చేరుకుంది. శివాజీ వ్యాఖ్యలను మహిళలను అవమానించేలా ఉన్నాయని అనసూయ ఖండించారు. “వస్త్రధారణ అనేది పూర్తిగా వ్యక్తిగత ఇష్టం. అది ఎవరి అనుమతితోనో, సూచనలతోనో నడవాల్సిన విషయం కాదు” అంటూ ఆమె స్పష్టమైన స్టాండ్ తీసుకున్నారు.

Anasuya Bharadwaj దుస్తుల వ్యాఖ్యల నుంచి చీర ఛాలెంజ్ వరకూ అనసూయ శివాజీ వివాదం కొత్త మలుపు

Anasuya Bharadwaj : దుస్తుల వ్యాఖ్యల నుంచి చీర ఛాలెంజ్ వరకూ.. అనసూయ-శివాజీ వివాదం కొత్త మలుపు..!

Anasuya Bharadwaj : మ‌హిళ‌పై మ‌రో మ‌హిళ ఫైర్..

దీంతో ఈ అంశంపై సినీ, రాజకీయ వర్గాల్లో మాటల యుద్ధం మొదలైంది. ఈ వివాదంలోకి సామాజిక కార్యకర్త, బీజేపీ నేత డాక్టర్ ప్రభాగౌడ్ ఎంట్రీ ఇవ్వడంతో విషయం మరింత ముదిరింది. అనసూయ వస్త్రధారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెకు చీరను గిఫ్ట్‌గా పంపిస్తానని, అంతేకాదు ‘చీర ఛాలెంజ్’ను ప్రారంభిస్తున్నానని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. “మహిళలు పద్ధతిగా చీర కట్టుకోవాలి” అంటూ వ్యాఖ్యలు చేయడం మరో వివాదానికి దారితీసింది.ఈ వీడియోపై ప్రముఖ గాయని చిన్మయి ఘాటుగా స్పందించారు. ఒక మహిళను లక్ష్యంగా చేసుకుని మరో మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేయడం, గిఫ్ట్ పేరుతో వేధించడం సరికాదు. ఇది తిరోగమన ఆలోచనలకు ఉదాహరణ” అంటూ చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాగౌడ్ వీడియో, ప్రొఫైల్‌ను ట్యాగ్ చేయడం వైరల్‌గా మారింది.

ఇదిలా ఉండగా, ఈ వివాదానికి మూలమైన శివాజీ వ్యాఖ్యలు కూడా మరోసారి నెట్టింట చర్చకు వస్తున్నాయి. హీరోయిన్ల దుస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల స్వేచ్ఛ, గౌరవంపై ప్రశ్నలు లేవనెత్తాయి. గ్లామర్‌కు హద్దులు ఉండాలన్న ఆయన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.మొత్తానికి ‘దండోరా’ ఈవెంట్‌తో మొదలైన ఈ అంశం ఇప్పుడు అనసూయ–శివాజీ వాగ్వాదం, చీర ఛాలెంజ్, చిన్మయి ప్రతిస్పందనతో మరింత విస్తరించింది. సోషల్ మీడియాలో ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అనసూయ ఈ తాజా పరిణామాలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది