Anasuya : అమ్మాయిలూ.. ఆ పని ఎంతో అవసరం అనసూయ..!
ప్రధానాంశాలు:
Anasuya : అమ్మాయిలూ.. ఆ పని ఎంతో అవసరం అనసూయ..!
Anasuya : ఈ రోజుల్లో ఇంటి పనులతో రోజంతా బిజీగా గడిపే గృహిణులు తమ ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించలేరు. ఉదయం పిల్లల స్కూల్, భోజనం తయారీ, ఇంటి పని ఇలా అనేక బాధ్యతలతో సమయం లేనిపక్షంలో ఫిట్‌నెస్‌ను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్ అనసూయ తన వ్యక్తిగత అనుభవంతో గృహిణులకు ఓ స్పూర్తిదాయక సందేశం ఇచ్చింది.

Anasuya : అమ్మాయిలూ.. ఆ పని ఎంతో అవసరం అనసూయ..!
Anasuya అనసూయ ఇలాంటి సందేశాలు కూడా ఇస్తుందా..?
తాజాగా ఆమె జిమ్‌లో చేస్తున్న వ్యాయామం వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “మునుపటివరకు నేను కూడా జిమ్ అవసరమేంటీ అనేవారిలోనే ఒకరిని. కానీ ఇప్పుడు రెగ్యులర్‌గా వెయిట్ ట్రైనింగ్ చేయడంతో నా ఆరోగ్యంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. 30ల చివర్లోకి వచ్చాక ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమని అర్థమైంది” అంటూ తెలిపింది. చిన్నవయసులోనే వ్యాయామం అలవాటు చేసుకోవాలని ఆమె సూచించారు.
అనసూయ చెప్పిన ఈ సందేశం మహిళలకు ఎంతో ప్రయోజనం కలిగించేలా ఉంది. “ఇది మీ కుటుంబం కోసమే కాదు, మీ కోసమే. జిమ్ లగ్జరీ కాదు.. అవసరం!” అనే ఆమె మాటలు ప్రతి గృహిణి ఆలోచించాల్సిన విషయమే. వ్యాయామంతో ఆరోగ్యంగా ఉండటం వంటివాటితో పోరాడే శక్తిని కలిగిస్తుంది. ఈ సందేశంతో అనసూయ మరోసారి తన స్పూర్తిదాయక వైఖరిని చాటింది.