Anasuya in big issue
Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. సినిమాలతో విపరీతంగా క్రేజ్ రావడంతో జబర్దస్త్ వదిలేసి అనసూయ సినిమాలకే పరిమితం అయింది. ప్రస్తుతం పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక సినిమాలతో అనసూయ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా అనసూయ సోషల్ మీడియాలో ఓ రిక్వెస్ట్ పెట్టింది.
ఎప్పుడు వివాదాలతో హాట్ టాపిక్ గా ఉండే అనసూయ ఇప్పుడు ప్రత్యేక విన్నపంతో నెటిజన్ల ముందుకు రావడం అందరిని ఆకర్షించింది. నాదొక ప్రత్యేక విన్నపం. కొన్ని రోజులుగా కొన్ని ట్వీట్ లు చూస్తున్నాను. రాజకీయాలు, సినిమాల్లో ఉన్న కొందర్ని కించపరచడానికి నా పేరు వాడుకుంటున్నారు. నాతో కంపేర్ చేస్తూ వాళ్లను కించపరుస్తున్నారు. ఇలా చేయడం నన్ను కూడా కించపరచడమే అవుతుంది. మహిళగా తనకంటూ ఓ మార్గాన్ని ఏర్పరుచుకున్నానని, తనకు ఎలాంటి పీఆర్ వ్యవస్థ కూడా లేదని తెలిపింది అనసూయ. తనంటే ఇష్టంలేకపోయినా, తనను ప్రోత్సహించడం ఇష్టం లేకపోయినా దయచేసి తనకు దూరంగా ఉండాలని అనసూయ కోరింది.
Anasuya in big issue
చర్చించే సామర్థ్యం కూడా లేని కొంతమంది వ్యక్తులు, ఎలాంటి దయ, మానవత్వం లేకుండా తన పేరును అనవసర విషయాల్లోకి లాగుతున్నారని ఆమె ఆరోపించింది. ఓ మంచి మార్పు కోసమే తను సోషల్ మీడియాలో కొనసాగుతున్నాను అని, పైగా తనకు ఓ కుటుంబం ఉందని ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని వ్యవహరించాలని తన పేరును తప్పుగా వాడుతున్న వారికి గట్టి సమాధానం ఇచ్చింది. ఇక ఎప్పటిలాగే కొందరు ఆమె కామెంట్స్ పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. రీసెంట్గా కొంతమంది రాజకీయ నాయకులపై ట్రోలింగ్ చేసే క్రమంలో మీమ్స్, సినిమాలో చెప్పిన డైలాగులను కొంతమందిని నెటిజన్స్ వాడుకున్నారు. దీనిపై అనసూయ రియాక్ట్ అయింది.
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
This website uses cookies.